ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool: జగన్ తిరుమలకు రావద్దంటూ భక్తుల వినూత్న నిరసన

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:01 PM

Andhrapradesh: ‘‘జగన్‌కు కులమే లేదు. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది. కడప అనేది దేవుని గడప. దుర్మార్గులు కడప పేరును మార్చారు. కడపకు వైయస్సార్ జిల్లా అని పేరు పెట్టుకున్నారు. పవిత్రమైన కడప పేరును బ్రిటిష్ వాళ్ళు కూడా మార్చడానికి సాహసం చేయలేదు’’..

Innovative protest of devotees

కర్నూలు, సెప్టెంబర్ 27: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Former CM YS Jaganmohan Reddy) తిరుమల పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. జగన్‌ తిరుమలకు రావొద్దంటూ హిందూ సంఘాలు, కూటమి నేతలు పట్టుబడుతున్నారు. జగన్ తిరుమలకు వస్తే కచ్చితంగా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. జగన్‌ తిరుమలకు రావద్దంటూ కర్నూలులో కొందరు భక్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి ఆలయం వద్ద నోటికి శూలాలు గుచ్చుకొని భక్తులు నిరసనకు దిగారు. జగన్ తిరుపతికి రావొద్దంటూ వారు పట్టుబడుతున్నారు. వీరి నిరసనకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి (TDP Leader Byreddy Rajashekar Reddy) సంఘీభావం తెలిపారు.

Anam: యేసు ప్రభు, శ్రీవారితో పెట్టుకున్నావ్.. భస్మమైపోతావ్ జగన్


ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ హిందూ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసిన జగన్ దొంగ దర్శనం కోసం తిరుపతికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్లకు ప్రతి ఇంటికి ఒక కుల దైవం ఉంటారని.. తమ ఇంటి కుల దైవం వీరభద్ర స్వామి అని తెలిపారు. ‘‘జగన్‌కు కులమే లేదు. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది. కడప అనేది దేవుని గడప. దుర్మార్గులు కడప పేరును మార్చారు. కడపకు వైయస్సార్ జిల్లా అని పేరు పెట్టుకున్నారు. పవిత్రమైన కడప పేరును బ్రిటిష్ వాళ్ళు కూడా మార్చడానికి సాహసం చేయలేదు’’ అని అన్నారు.

Devara movie: ‘దేవర’ చిత్రం విడుదలలో అపశృతి



జగన్ తన సొంత జిల్లాకు కొవ్వు జిల్లా గొడ్డు మాంసం జిల్లాగా అని పేరు పెట్టుకోండి సరి పోతుంది అంటూ ఎద్దేవా చేశారు. వైయస్సార్ జిల్లా పేరును తీసేసి కడప జిల్లాగా తిరిగి మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు జగన్ తిరుపతికి వెళ్లాలనుకుంటున్నారన్నారు. తిరుపతిని అపవిత్రం చేసిన జగన్ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడానికి అనర్హుడని తెలిపారు. ఏదో ఒక రోజు జగన్‌ను బట్టలు విప్పి సుంకులమ్మ కొరడాలతో జనం కొట్టడం ఖాయమని దీనికి మించిన ప్రాయశ్చిత్తం లేదని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.


కాగా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనలో ఆరోపణల నేపథ్యంలో వైఎస్ జగన్ ఈరోజు (శుక్రవారం) రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు. రేపు (శనివారం) శ్రీవారిని దర్శించుకోనున్న జగన్ మధ్యాహ్నం బెంగుళూరుకు వెళ్లనున్నారు. అయితే తిరుమలకు జగన్ రానున్న నేపథ్యంలో డిక్లరేషన్‌ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతస్తుడైన జగన్.. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు, రాజకీయ పార్టీ నుంచి డిమాండ్‌లు పెరిగాయి. సంతకం పెట్టకపోతే జగన్‌ను దర్శనానికి అనుమతించకూడదని పలు వర్గాల డిమాండ్ చేస్తున్నాయి. దీంతో జగన్ ఏ విధంగా శ్రీవారి దర్శనానికి వెళ్తారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి..

Tirumala: కాక రేపుతున్న జగన్ తిరుమల పర్యటన

Anam: యేసు ప్రభు, శ్రీవారితో పెట్టుకున్నావ్.. భస్మమైపోతావ్ జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 01:02 PM