ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం

ABN, Publish Date - Aug 13 , 2024 | 11:44 AM

Andhrapradesh: శ్రీశైలంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం దేవస్థానం ఏఈఓ మోహన్ గృహంలోని కాంపౌండ్‌లో చిరుత పులి సంచారించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. పాతాళగంగ మార్గంలోని ఇంటి ప్రహరీ గోడపై మంగళవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది.

leopard migration in Srisailam

నంద్యాల, ఆగస్టు 13: శ్రీశైలంలో (Srisailam) చిరుత (Leopard) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం దేవస్థానం ఏఈఓ మోహన్ గృహంలోని కాంపౌండ్‌లో చిరుత పులి సంచారించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. పాతాళగంగ మార్గంలోని ఇంటి ప్రహరీ గోడపై మంగళవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది. ఇంటి ప్రహరీగోడపై చిరుతపులి ఉన్న వీడియో సీపీ టీవీఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

CM Chandrababu: కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఏం చెప్పారంటే..?



విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. చిరుతపులి తిరిగిన ప్రదేశాలను అటవిశాఖ అధికారులు పరిశీలించారు. చిరుత సంచారం నేపథ్యంలో రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. వీలనంత త్వరగా చిరుత బంధించాలని స్థానికులు వినతి చేస్తున్నారు. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు యత్నిస్తున్నారు.

Neeraj Chopra - Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ ప్రేమ వివాహం? మను తండ్రి స్పందన ఏంటంటే..


కాగా.. గత నెలలో శ్రీశైలం దేవస్థానం పరిధిలోని పాతాళగంగ పాతమెట్ల రోడ్డు సమీపంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో పాతాళగంగ పాతమెట్ల రోడ్డు మార్గం రన్‌వేపై చిరుత కూర్చుని ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే తమ తమ సెల్‌ఫోన్లలో చిరుత దృశ్యాలను చిత్రీకరించారు. విషయం తెలిసిన అటవీ అధికారులు అక్కడి ప్రజలకు పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు, సమీప రహదారి వెంట ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి...

Operation Akarsh: మరోసారి ఆకర్ష.. ఆకర్ష!

CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2024 | 11:46 AM

Advertising
Advertising
<