ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nimmala: తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది..

ABN, Publish Date - Aug 17 , 2024 | 12:23 PM

Andhrapradesh: తుంగభద్ర డ్యామ్ దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు, మూడవ ఎలిమెంట్‌లు ఇంజనీర్లు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు.

Minister Nimmala Ramanaidu

కర్నూలు, ఆగస్టు 17: తుంగభద్ర డ్యామ్ (Thungabhadra Dam) దగ్గర 19వ తాత్కాలిక గేటు బిగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు, మూడవ ఎలిమెంట్‌లు ఇంజనీర్లు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) మాట్లాడుతూ... తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60x4 మొదటి బిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందన్నారు. చరిత్రలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది మొదటిసారన్నారు.

Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!


ఈరోజు (శనివారం) మిగిలిన నాలుగు బిట్‌ల అమరిక పూర్తయితే 70 టీఎంసీల నీటిని సముద్రంపాలు కాకుండా కాపాడుకోగలుగుతామన్నారు. తుంగభద్ర గేటు మరమ్మతులను విజయవంతంగా పూర్తి చేసే నిపుణుల రిస్క్ టీంకు సారధ్యం వహించేలా అత్యంత నిపుణత కలిగిన కన్నమ నాయుడుకు బాధ్యతలు అప్పగించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుకు నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు.


మూడు రోజుల క్రితమే తుంగభద్ర జలాశయంలో తుంగభద్ర జలాశయంలో గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. తుంగభద్ర 19వ నెంబర్ గేట్‌ వద్ద డ్యామ్ వద్ద అధికారులు పూజలు చేసి పనులను మొదలుపెట్టారు. కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో జలాశయ అధికారులు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్‌ గేటును అమర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

TG Politics: బీజేపీ, కాంగ్రెస్ పొలిటికల్ గేమ్.. మధ్యలో ఇరుక్కున్న బీఆర్‌ఎస్..!



కాగా... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈనెల 10న రాత్రి డ్యామ్‌ 19వ గేటును ఎత్తుతుండగా చైన్‌లింక్‌ తెగిపోవడమే ఇందుకు కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కుల మేర అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన డ్యామ్‌ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, కర్ణాటక నీరావరి నిగమ్‌ లిమిటెడ్‌ (కేఎన్‌ఎన్‌ఎల్‌) ప్రాజెక్టు నిపుణుడు రాజేశ్‌ సహా హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన ప్రాజెక్టు నిపుణులు కూడా అక్కడకు మరమ్మతులకు సంబంధించి పలు సూచనలు చేశారు. డ్యామ్‌ ఖాళీ చేయకుండా గేటు మరమ్మతు చేయాలి నిర్ణయించారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్‌ గేటును అమర్చాలని నిపుణులు నిర్ణయించారు. మూడు రోజుల క్రితమే 19వ గేటు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి.


ఇవి కూడా చదవండి...

Jagdeep: నెల్లూరు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!

Read Latest AP News And Telangana News

Updated Date - Aug 17 , 2024 | 12:27 PM

Advertising
Advertising
<