ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

ABN, Publish Date - Oct 22 , 2024 | 09:43 AM

మీసాలు గడ్డాలు ఉండొద్దని.. తాము చెప్పిన కళ్ళజోడే వాడాలంటూ సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారు. మీసాలు, గడ్డాలు తీసేయాలని, మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వత్తిడి తెస్తున్నారని జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్ల జూనియర్ వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

కర్నూలు: మెడికల్ కాలేజీ (Medical College)లో ర్యాగింగ్ కలకలం (Raging Kalakalam) రేగింది. సీనియర్ వైద్య విద్యార్థులు (Senior Students) జూనియర్ విద్యార్థులను (Junior Students) ర్యాగింగ్ చేశారు. ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపకులు కూడా అనేక సార్లు ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల ప్రిన్సిపల్ యాంటీ ర్యాగింగ్‌పై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అయినా ర్యాగింగ్ మాత్రం ఆగడం లేదు.

మీసాలు గడ్డాలు ఉండొద్దని.. తాము చెప్పిన కళ్ళజోడే వాడాలంటూ సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారు. మీసాలు, గడ్డాలు తీసేయాలని, మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యార్థులపై వత్తిడి తెస్తున్నారని జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్ల జూనియర్ వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే కళాశాలలోని హాస్టల్‌లో సైతం మెస్‌కు వెళ్లి తమకు భోజనం తీసుకురావాలని, ప్లేట్లు కడగాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. కొందరు సీనియర్‌ వైద్య విద్యార్థులు హాస్టల్‌లోనే సిగరెట్లు, మద్యం తాగుతున్నారని తెలిసింది. ఈ విషయాలపై విచారణ చేసేందుకు అధికారులు హాస్టల్‌ గేటు వద్దకు వెళ్లగానే వారికి సమాచారం అందుతుందని, అప్రమత్తం అవుతున్నారని తెలుస్తోంది.


అయితే మూడు రోజుల క్రితమే మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. తాజాగా ర్యాగింగ్ కలకలం రేగడంతో కళాశాల ప్రిన్సిపల్ మరోసారి సీనియర్ విద్యార్థులను పిలిచి మాట్లాడనున్నారు. కాగా ఎవరిపై ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతి గదుల్లోకి కొందరు సీనియర్‌ విద్యార్థులు గుంపులుగా వచ్చి ర్యాగింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కొందరు తమ తల్లిదండ్రుల ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియవచ్చింది. దీనిపై అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: చందానగర్‌లో విషాద ఘటన..

గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాలపై సమీక్షించిన సీఎం

నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 22 , 2024 | 10:29 AM