Crime News: వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..
ABN, Publish Date - Nov 14 , 2024 | 09:13 AM
కర్నూలు జిల్లా, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అరెస్టు చేశారు.
కర్నూలు జిల్లా: కోసిగి మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థినిపై (Student) అత్యాచారయత్నం చేసిన వైఎస్సార్సీపీ (YSRCP) సర్పంచ్ హుసేని (Sarpanch Hussaini) ఇద్దరు కార్యకర్తలు సూరి (Suri), వినోద్ (Vinod)లను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. వివరాల్లోకి వెళితే.. కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని పత్తిచేలో పని నిమిత్తం సుగ్గికి వలస వెళ్లారు. ఎనిమిదో తరగతి చదువుతున్న తమ కుమార్తెను తాత దగ్గర వదిలి వెళ్లారు. ఆ బాలికపై కన్నేసిన గ్రామ సర్పంచ్ హుసేని.. తన ఇద్దరు కార్యకర్తలు రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో పడుకున్న బాలికపై అత్యాచార యత్నం చేస్తుండగా... బాలిక తాత నిద్ర మేల్కొని సర్పంచి హుసేనిని పట్టుకుని గట్టిగా కేకలు వేశారు. దీంతో వారు ఆయనని తోసివేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కోసిగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్ర మోహన్.. సర్పంచి హుసేని , వినోద్, మజ్జిగ సూరిలపై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’ ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు.. ఇదో... వ్యవస్థీకృత నేరం.. కులాల మధ్య కుంపట్లు రాజేయడం.. సమాజంలో చిచ్చు పెట్టడం.. మహిళలను మానసికంగా వేధించడం.. బాలికలనూ వదలకుండా కామెంట్లతో హింసించడం.. గౌరవంగా బతికే దళితులను అవమానించడం.. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం.. పనిలోపనిగా బలవంతపు వసూళ్లకూ పాల్పడటం.. వైసీపీ సోషల్ మీడియా వెనుక ఇంతటి విషం దాగుందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 14 , 2024 | 09:13 AM