ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Line drawings of primitive man : అపురూపాలు - ఆదిమానువుడి రేఖా చిత్రాలు

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:25 PM

ఎంతో అరుదైన, అపురూపమైన ఆదిమానవుడు రేఖా చిత్రాలు చింతకుంట కొండలో కనువిందు చేస్తున్నాయి. 25 వేల ఏళ్ల కిందట ఇక్కడ మా నవులు ఆవాసం ఏర్పరచుకున్నారని, జీవించా రని, కొండపై చిత్రించిన రేఖా చిత్రాలు ఆధార భూతమై నిలుస్తున్నాయి. ఇక్కడి వాతావర ణం, నీరు, ఆహారం పుష్కలంగా ఉండడంతో ఆదిమానవుడు ఆవాసానికి అనువైన ప్రదేశం గా ఎంచుకుని నివసించి ఉంటారని దాదాపు 200 రేఖాచిత్రాలను తిలకించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఆదిమానవుడు చిత్రీకరించిన రేఖాచిత్రాలు

25వేల ఏళ్ల నాటి ఆదిమానవుని ఆనవాళ్లు

చింతకుంట కొండలో పెరుగుతున్న సందర్శకుల సందడి

రక్షణ కల్పించలేని పర్యాటక, పురావస్తు శాఖలు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటున్న పర్యాటకులు

ముద్దనూరు అక్టోబరు22 (ఆంధ్రజ్యోతి): ఎంతో అరుదైన, అపురూపమైన ఆదిమానవుడు రేఖా చిత్రాలు చింతకుంట కొండలో కనువిందు చేస్తున్నాయి. 25 వేల ఏళ్ల కిందట ఇక్కడ మా నవులు ఆవాసం ఏర్పరచుకున్నారని, జీవించా రని, కొండపై చిత్రించిన రేఖా చిత్రాలు ఆధార భూతమై నిలుస్తున్నాయి. ఇక్కడి వాతావర ణం, నీరు, ఆహారం పుష్కలంగా ఉండడంతో ఆదిమానవుడు ఆవాసానికి అనువైన ప్రదేశం గా ఎంచుకుని నివసించి ఉంటారని దాదాపు 200 రేఖాచిత్రాలను తిలకించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. వీరు ఏర్పాటు చేసు కున్న నివాస ప్రదేశాల ఆచూకీ తెలుసుకు నేందుకు అనువుగా అక్కడక్కడా ఎరుపు రంగు ఆకుపసరుతో బాణం గుర్తులను ఏర్పా టు చేసుకు న్నారని అంటున్నారు. ఈరేఖా చిత్రాల ఆధారంగా ఆది మానవడు దాదాపు 12 అడుగుల ఎత్తు ఉండ వచ్చని, కొండలో ఇంకా గాలిస్తే ఎన్నో ఆనవా ళ్లు లభించే అవకాశం వుందని అంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరి స్తే ఆదిమానవుడి ఆనవాళ్లు మరెన్నో గుర్తించ వచ్చు. వివరాల్లోకెళితే....


రేఖాచిత్రాల అన్వేషణ కోసం మొదటగా వెళుతున్న ఇన్‌టాక్‌ సభ్యులు, యోగివేమన ప్రొఫెసర్లు,పర్యాటకశాఖ, అధికారులు, ఎంపీడీఓ

నాటి చరిత్ర, నేటి యువతరానికి ప్రతీకలు, శతాబ్ధాలు దాటిన ప్రతి ఆనవాళ్లు చరిత్రకు ప్రతీకగా, అపురూపంగా భావించి, వాటి అభి వృద్ధి, రక్షణ కోసం పర్యాటక, పురావస్తు శాఖల ను ఏర్పాటు చేశారు. కోతి ద్వారా ఆదిమానవుడు రూపాంతరం చెందుతూ నేడు మనిషిగా మనుగడ కొనసాగిస్తున్నాడు. అటు వంటి ఎంతో పురాతన చరిత్ర కలిగిన 25వేల ఏళ్ల నాటి ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్న రేఖాచిత్రాలను, తిలకించేందుకు వచ్చే సందర్శకులకు చింతకుంట కొండలో రక్షణ కరువైందన్న విమర్శలు వస్తున్నాయి.

చింతకుంట పంచాయతీలోని కొండలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. కొండపై నెలకొన్న కోనలింగేశ్వరస్వామి(శివా లయం), సమీపంలోనే 1909 బ్రిటీ షర్లు ఏర్పాటు చేసిన విశాలమైన జలాశయాన్ని తలపిస్తున్న చింతకుం ట చెరువు. ఈప్రదేశంలో నెలకొన్న ప్రతి ఒక్కటీ చరిత్రను సుృష్టిస్తున్నాయి. 2010 ఆగస్టు 17న అప్పటి ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్‌, వివేకవర్థిని జూనియర్‌ కళాశాల తెలు గు అధ్యాపకులు పుల్లారెడ్డి, కడప ఇన్‌టాక్‌ లైఫ్‌మెంబర్‌, అప్పటి జిల్లా కన్వీనర్‌ సీతారామ య్య, అప్పటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారి సత్యం కొందరు పత్రికా విలేకరుల సహకారంతో ఆది మానవుడి ఆనవాళ్ల కోసం కొండలో గాలించి ఆదిమానవుడి రేఖాచిత్రాలను వెలుగులోకి తెచ్చారు.


మబ్బు గుండులో అప్పటి డీఆర్‌డీఏ పీడీ, పర్యాటకశాఖ గోపాల్‌, ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్‌

ఎద్దుల ఆవులగుం డు, గొడుగుగుండు, చిన్నావిడగుండు, పెద్దావిడ గుండు, మారెమ్మగుండు, గనంగుండు, మబ్బుగుండు, చిలకలోల్లగుండు ఇంకా ఎన్నో గుండ్ల పై ఆది మానవుడు నాటి నాగరికత, పనిముట్లు, జంతువుల రేఖాచిత్రాలను కొండరాళ్లకు ఆకు పసరుతో నేటి యుగానికి కనువిందు చేసేలా చిత్రించాడు. ఏనుగు, జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, ఎద్దు, విల్లంబులు ఎక్కు పెట్టిన మానవాకృతులు, అప్పటి వేటకు ఉపయోగించే పనిముట్లు, లైంగిక చిత్రాలు, దాదాపు 200 రేఖాచిత్రాలు కనిపిస్తాయి. ఈరే ఖాచిత్రాలను తిలకించిన మేధావులు ఆది మా నవుడు నివాసానికి అనువైన ప్రదేశంగా ఎంచుకుని ఆవాసం ఏర్పరచుకుని ఉంటారని అంటున్నారు. ఈరేఖా చిత్రాల ఆధారంగా ఆది మానవులు ఎక్కువ సంఖ్యలో ఉండి వుంటా రని తెలుస్తోంది. అంతే కాకుండా ఇక్కడ వారి నివాసాలను గుర్తించేందుకు అనువుగా ఎరుపు రంగుతో బాణం గుర్తులను ఏర్పాటు చేసుకు న్నారని అంటున్నారు. అంతేకాకుండా వారు మరణిస్తే మృతదేహం పట్టేలా రాతి గుండును మలిచి మృతదేహాన్ని దానిలో పడుకోబెట్టి సీసంతో నింపి అంత్యక్రియలు చేసేవారని వివరిస్తున్నారు. ఈప్రదేశంలో అటువంటి శ్మశానవాటిక ఉండవచ్చని వెదికితే గుర్తించవచ్చని అంటు న్నారు.


గొడుగు గుండు

కొండలో గాలిస్తే మరెన్నో ఆనవాళ్లు లభించే అవకాశం వుందని, ఇటువంటి వాటిని గుర్తించి వాటిని భద్రపరిస్తే చరిత్రకు ఆన వాళ్లుగా నిలుస్తాయని అంటున్నా రు. రేఖాచిత్రాలు వెలుగు చూసిన తరువాత ఈ ప్రదేశాన్ని ఎందరో సందర్శనార్థం వస్తున్నా రు. కొండపైకి వెళ్లాలంటే దారి సరిగాలేక పోవడంతో 2010లో ఉపాధి పథకంలో భాగం గా పర్యాటకుల కోసం అప్పటి ఎంపీడీఓ మొగి లిచెండు సురేష్‌ గ్రావెల్‌ రోడ్డును ఏర్పాటు చేయించారు. 2010 ఆగస్టు24న అప్పటి డీపీ ఆర్‌ఓ ప్రసాద్‌, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్లు సాంబశివారెడ్డి, రామబ్రహ్మం విద్యా ర్థులతో కలిసి సందర్శించారు. తరువాత 2011 ఫిబ్రవరి19న అప్పటి డీపీఆర్‌ఓ గోపాల కొండలోని అన్ని గుండ్లకు ఉన్న రేఖా చిత్రాలను సందర్శించారు. అప్పట్లో జమ్మలమ డుగు న్యాయమూర్తి, న్యాయవాదులు, ఆర్టీపీపీ ఉద్యోగులు రేఖాచిత్రాలను సందర్శించారు. మనరాష్ట్రం విద్యార్థులే కాకుండా కర్నాటక రాష్ట్రం నుంచి విద్యార్థులు సందర్శనార్థం వస్తూ నే వున్నారు. ఆతర్వాత 6వతరగతి సాంఘిక శాస్త్రంలో ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానవుడు పాఠ్యాంశంలో రచయిత, ప్రస్తుతం సంబేపల్లె హెచ్‌ఎం మడితాటి నరసింహారెడ్డి పొందుపరి చారు. దీంతో ఈ ప్రదేశంపై రాష్ట్ర విద్యార్థులు తెలుసుకునే అవకాశం కలిగింది. ఎంతో చరిత్ర కలిగిన ఆదిమానవుడి రేఖాచిత్రాలకు పర్యాట క, పురావస్తు శాఖ వారు రక్షణ కల్పించలేక పోతున్నారు. అప్పట్లో సందర్శనార్థం వచ్చిన కడప అక్షర పాఠశాల విద్యార్థులపై తేనెటీగల దాడి చేశాయి. అయినా అధికారులు స్పందించ క పోవడం గమనార్హం. ఇప్పటికైనా సందర్శకు లకు రక్షణ కల్పించ వలసిన అవసరం ఎంతైనా వుంది.

Updated Date - Oct 29 , 2024 | 11:26 PM