ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India Meteorological Dept : బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:28 AM

గ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

  • నేటి నుంచి కోస్తా, సీమలో వానలు

  • రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు

విశాఖపట్నం, పాడేరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న రెండు రోజుల్లో తమిళనాడు తీరం దిశగా రానుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అల్పపీడనం మంగళవారం వరకూ పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయవ్యంగా పయనించే క్రమంలో ఈనెల 19వ తేదీకల్లో ఏపీలో మధ్య, ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి వర్షాలు పెరగనున్నాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. బుధవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు, గురువారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


అయితే, అల్పపీడనం కోస్తా తీరం దిశగా నెమ్మదిగా పయనిస్తోందని ఇస్రో వాతావరణ నిపుణుడు వివరించారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీన కోస్తాలో అక్కడక్కడ, 21న ఉత్తర కోస్తాలో ప్రధానంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లాల వరకు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో డిసెంబరు నెలకు సంబంధించి ఇది మూడో అల్పపీడనమని(ఒకటి తుఫాన్‌గా మారింది) విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అధికారి ఎస్‌.జగన్నాథకుమార్‌ తెలిపారు. మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల వరకు ఉన్నందున అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీలో కోస్తా/ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీలు నమోదవుతున్నందున అల్పపీడనం బలపడే అవకాశం లేదని తెలిపారు. అల్పపీడనం తమిళనాడు తీరం దిశగా వచ్చిన తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి ఒకటి, రెండు రోజులు అక్కడే ఉండిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో తేమ మేఘాలు ఉత్తరకోస్తా వైపు వస్తాయని పేర్కొన్నారు. 19న విశాఖ, విజయనగరం, 20న శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందన్నారు. తర్వాత రెండు రోజు లు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 04:28 AM