ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coastal AP : కోస్తాకు వాన గండం

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:42 AM

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

  • తమిళనాడు తీరం దిశగా అల్పపీడనం: ఐఎండీ

  • ఉత్తర, మధ్య కోస్తాల దిశగా వస్తుందన్న ఇస్రో నిపుణుడు

  • నేటి నుంచి 21 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

  • వరి, పత్తి, పొగాకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

రైతులూ.. ధాన్యం జాగ్రత్త: విపత్తుల శాఖ

అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని సూచించింది.

(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్‌)

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా పయనించి బుధవారం నాటికి ఏపీలోని ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తర్వాత రెండు రోజుల్లో నెమ్మదిగా పయనించి ఏపీ కోస్తా తీరంలో బలహీనపడుతుందన్నారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో కోస్తాలో అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


19న విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు, 20న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కోస్తా తీరం దిశగా పయనించే క్రమంలో సముద్రం నుంచి భారీగా తేమ రానున్నందున ఈనెల 21వ తేదీ వరకు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు, అక్కడకక్కడా అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణుడు ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల వరి, పత్తి, పొగాకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు వాయిదా వేసుకోవాలని, పొలాల్లో ఉంచిన కుప్పలను సంరక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం నేపథ్యంలో ఈనెల 25వ తేదీ వరకూ దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇదిలావుండగా మంగళవారం ఉత్తరకోస్తా, తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా జిల్లాల్లో చలితీవ్రత కొనసాగింది. బుధవారం చలి తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • అరకులోయలో 5.3 డిగ్రీలు

మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం అరకులోయలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జి.మాడుగులలో 6.5, జీకే వీధిలో 7.2, హుకుంపేట, చింతపల్లిల్లో 7.4, ముంచంగిపుట్టులో 9.7, పెదబయలులో 10.3, అనంతగిరిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండడంతో ఏజెన్సీలో పొగమంచు కురవలేదు. అయినా, చలి తీవ్రత తగ్గలేదు.

Updated Date - Dec 18 , 2024 | 03:42 AM