ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Elections: మహాయుతిదే విజయం

ABN, Publish Date - Nov 18 , 2024 | 08:10 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భాగస్వామ్య పక్షాలు ఘన విజయం సాధిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ అభ్యర్థలు గెలుపు కోసం పిఠాపురంలోని శ్రీ పాద వల్లభ స్వామి ఆలయంలో బీజేపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయని ఆయన తెలిపారు.

అమరావతి, నవంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం గణనీయ పురోగతి సాధిస్తుందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య కూటమైన మహాయుతి ప్రభుత్వం గొప్ప ప్రగతిని సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభంగా ఎదగాలని తాము ఆశిస్తున్నామన్నారు.

Vemuri Radha Krishna: తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసింది


మహారాష్ట్రలోని అభ్యర్థులందరికీ పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ స్వామితోపాటు మా తుల్జా భవాని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయంలో జనసేన, బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read: కేసీఆర్‌ను మించిన నియంతలా రేవంత్


మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో.. అంటే నవంబర్ 18వ తేదీతో ముగిసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన చేపట్టారు.

Also Read: కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన హరీశ్ రావు


ఇక మహారాష్ట్రలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణించారు. దీంతో సీఎం చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్ల వలసి వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం


ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే), కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్న మహా వికాస్ అఘాడి.. అలాగే ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే), బీజేపీలు కలిసి మహాయుతి మధ్య నెలకొంది. దీంతో మహాయుతిని గద్దె దించడమే లక్ష్యంగా మహా వికాస్ అఘాడి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

Also Read: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి


అయితే మళ్లీ తామే అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంలో మహాయుతి ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏ కూటమికి మహారాష్ట్ర ఓటరు పట్టం కట్టాడనేది తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే.. ఆ రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: నిమ్మకాయలతో ఇన్ని లాభాలున్నాయా..?

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 18 , 2024 | 08:10 PM