AP Politics: మంగళగిరి ఇన్‍ఛార్జ్‌ని మార్చిన వైసీపీ.. నారా లోకేశ్‌పై పోటీ చేసేది ఎవరంటే?
ABN, Publish Date - Mar 01 , 2024 | 09:09 PM
ఏపీలోని అధికార వైఎస్సార్‌సీపీ 9వ జాబితాను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళవారం నియోజకవర్గంలో ఇన్‌ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరుని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది.
తాడేపల్లి: ఏపీలోని అధికార వైఎస్సార్‌సీపీ 9వ జాబితాను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఇన్‌ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరుని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కోడలు లావణ్య. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, గంజి చిరంజీవి, కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులతో చర్చించిన అనంతరం వైసీపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో లావణ్యను బరిలోకి దించాలన్న వైసీపీ నిర్ణయించింది.
ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. కర్నూలు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్) పేర్లను ప్రకటించింది.
అభ్యర్థులు లేక వైఎస్సార్‌సీపీ అల్లాడిపోతున్నట్టుగా ఈ జాబితాను చూస్తే అర్థమవుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నెల్లూరులో ఎంపీ అభ్యర్థి దొరక్క విజయసాయి రెడ్డిని ఆ పార్టీ రంగంలోకి దింపినట్టుగా స్పష్టమవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక నెల రోజులు తిరక్కముందే మంగళగిరి అభ్యర్థిని వైసీపీ అధిష్ఠానం మార్చడం గమనార్హం. గతంలో గంజి చిరంజీవిని ప్రకటించిన ఆయనకు షాక్ ఇస్తూ మార్చివేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు గంజి చిరంజీవి అస్సలు పోటీ ఇవ్వలేరని సర్వేలు తేల్చిచెప్పడంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లావణ్య సాయంత్రం 7 గంటలకు వైసీపీ పార్టీలో చేరగా రాత్రి 9 గంటలకు ఆమెను అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించడం గమనార్హం.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 02 , 2024 | 06:10 AM