టీడీపీలో ప్రతి కార్యకర్తకూ గౌరవం
ABN, Publish Date - Nov 27 , 2024 | 04:47 AM
తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తారనేందుకు తానే ఉదాహరణ అని చేర్రెడ్డి మంజులారెడ్డి చెప్పారు. హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితులైన మంజులారెడ్డి.. మంగళవారం విజయవాడ శిల్పారామంలో బాధ్యతలను చేపట్టారు.
హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ మంజులారెడ్డి
విజయవాడ, రెంటచింతల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తారనేందుకు తానే ఉదాహరణ అని చేర్రెడ్డి మంజులారెడ్డి చెప్పారు. హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితులైన మంజులారెడ్డి.. మంగళవారం విజయవాడ శిల్పారామంలో బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం దీక్ష, పట్టుదలతో పని చేసిన తనకు ఈ పదవిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకల అరాచకాలను పురుషులే తట్టుకోలేకపోయారు. అయితే ఓ మహిళ పోలింగ్ రోజున వైసీపీ మూకల గొడ్డలి దాడితో రక్తం కారుతున్నా అక్రమాలను అడ్డుకుని వీర వనితగా వార్తల్లోకెక్కారు. ఆమే పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన చేర్రెడ్డి మంజులరెడ్డి. పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా కూర్చొనేందుకు వెళ్లకుండా ఆమెను అడ్డుకునేందుకు వైసీపీ వర్గీయులు రోడ్డుపై పడేసి గొడ్డళ్లతో గాయపరిచారు. అయినా ఆమె వెనక్కి తగ్గకుండా రక్తపు గాయాలతోనే బూత్‌లో కూర్చొని వైసీపీ రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆ తెగువ పట్టుదలే మంజులారెడ్డికి పదవి రావడానికి దోహద పడిందని అంటున్నారు.
Updated Date - Nov 27 , 2024 | 04:47 AM