ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Volunteers: మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..

ABN, Publish Date - Apr 01 , 2024 | 01:52 PM

మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను ఈసీ దూరం పెట్టింది. దీంతో వలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు.. అలాగే గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలను అందస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1200 పైబడి వలంటీర్లు సేవలందిస్తున్నారు.

మచిలీపట్నం : మచిలీపట్నంలో వలంటీర్ల (Volunteers) మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను ఈసీ (EC) దూరం పెట్టింది. దీంతో వలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు.. అలాగే గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలను అందస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1200 పైబడి వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఇక రాజీనామా లేఖలో వలంటీర్లు పేర్కొన్న అంశాలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకు అందిస్తూ గత 50 నెలలుగా నిస్వార్ధ సేవలందిస్తున్నామన్నారు. ఎటువంటి రాజకీయాలకూ ప్రభావితం కాకుండా సేవలందిస్తున్నామని తెలిపారు.

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి తమపై ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. దీనికి తామంతా మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వలంటీర్లు తెలిపారు. ఇక వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కమిషనర్ బాపిరాజు స్పందించారు. మచిలీపట్నంలో వార్డు వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను పరిశీలిస్తున్నామన్నారు. నగర పాలక సంస్థలో 823 మంది వలంటీర్ల పోస్టులు ఉండగా.. అందులో 10 - 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 430 మంది నుంచి రాజీనామాలు అందాయని తెలిపారు. రాజీనామాలన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని బాపిరాజు వెల్లడించారు.

Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!

వలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు వెల్లడించారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్‌, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్‌ చేయించాలని ఈసీ ఆదేశించినట్లు మీనా తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను, నగదు పంపి ణీ పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని ఈసీ సూచించినట్లు వెల్లడించారు. నగదు పంపిణీలో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ(సీఎ్‌ఫడీ) పిటిషన్‌ వేసింది.

TDP: పింఛన్ల పంపిణీ ఆలస్యంపై చినరాజప్ప ఫైర్

మరిన్ని ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2024 | 01:52 PM

Advertising
Advertising