చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!
ABN, Publish Date - May 12 , 2024 | 04:40 AM
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి కొనసాగి ఉంటే అమరావతి చరిత్ర మరోలా ఉండేదని మేఘాలయ నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ దోనేటి శివాజీ అభిప్రాయపడ్డారు
మేఘాలయ నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ
అసోసియేట్ ప్రొఫెసర్ శివాజీ
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి కొనసాగి ఉంటే అమరావతి చరిత్ర మరోలా ఉండేదని మేఘాలయ నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ దోనేటి శివాజీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మారడంతో ఆయన విజన్ ఆగిపోయిందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ‘విజనరీ చంద్రబాబు టెక్-జెర్నీ హైదరాబాద్ టూ సైబరాబాద్’ అనే పుస్తకాన్ని శివాజీ రచించారు.
శివాజీ స్వగ్రామం ఏలూరు జిల్లా నూజివీడుకు సమీపంలోని గొల్లపల్లి. అణగారిన వర్గానికి చెందిన ఈయన నూజివీడు డీఏఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేశారు. స్వగ్రామం గొల్లపల్లి వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
చంద్రబాబు విజన్ గురించి ఆయన ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌ను మించిన స్థాయిలో అమరావతి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే నాటికి రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకువచ్చారు.
సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిగా ప్రణాళిక రూపొందించి అమరావతిలో భవన నిర్మాణాలు శరవేగంగా చేపట్టారు. సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఆయన విజన్ నిలిచిపోయింది. చంద్రబాబు రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే నవ్యాంధ్ర భవిష్యత్తు మరో విధంగా ఉండేది. ఇప్పటికీ మించి పోయింది లేదు. మరో పది సంవత్సరాలపాటు ఆయన అధికారంలో ఉంటే నవ్యాంధ్ర పురోగతి సాధిస్తుంది. యువతకు ఉజ్వల భవిష్యత్‌తో పాటు పారిశ్రామికంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
- నూజివీడు
Updated Date - May 12 , 2024 | 05:20 AM