ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: ‘ఆయన రాజీనామా చేస్తారా? జగన్ చేపిస్తారా?’

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:03 PM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దువ్వాడ వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీనివాస్‌కు కుటుంబం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా..

Minister Anama Ram Narayan Reddy

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దువ్వాడ వ్యవహారంపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీనివాస్‌కు కుటుంబం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మంత్రి. జగన్ రెడ్డి గౌరవంగా అతనిచే రాజీనామా చేయించి ఇంటికి పంపాలని, అలా చేస్తే పార్టీకీ, జగన్‌కు గౌరవం ఉంటుందని హితవు చెప్పారు. శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా? లేక జగన్ రాజీనామా చేయిస్తాడా? అని మంత్రి ఆనం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వైసీపీకి సమాధి కట్టారని.. ఇక పుష్ప గుచ్చం ఎవరు గుచ్చాలన్నదే మిగిలి ఉందంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పెద్దల సభలో ఉన్నవారే ఈ మధ్యకాలంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. రేపు పెద్దల సభలోకి దువ్వాడ శ్రీనివాస్ ఏ మొహం పెట్టుకుని వచ్చి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.


గ్రీవెన్స్ సెల్‌కు ఎక్కువగా వచ్చిన సమస్యలివే..

గ్రీవెన్స్ సెల్‌కి ఎక్కువ దేవాదాయ శాఖ సంబంధించిన సమస్యలు వచ్చాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వచ్చిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించామని తెలిపారు. తెలుగుదేశం కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన వారికి న్యాయం జరిగిందని భరోసా ఇస్తున్నామన్నారు. గ్రీవెన్స్ సెల్ ఒక్క రోజుతో అయిపోయేది కాదని.. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కంటే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లోనే ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని.. అనేక సమస్యలకు గ్రీవెన్స్ సెల్ ద్వారా పరిష్కారం దొరికిందన్నారు మంత్రి.


ఆస్తులన్నింటినీ గుర్తించాం..

దేవాదాయశాఖకు సంబంధించిన ఆస్తులు అన్నింటిని గుర్తించామని మంత్రి ఆనం తెలిపారు. సెక్షన్ 22a1c క్రింద 6,40,000 ఎకరాలు భూములు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 1,50,000 ఎకరాలు ధూప, దీప నైవేద్యం కింద భూములు ఇచ్చామని.. అవి కూడా కొన్ని అన్యకాంతం అయ్యాయని మంత్రి తెలిపారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్నారు. గతంలో ఈఓ గా పనిచేసిన ధర్మారెడ్డి తిరుమలలో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి అన్నారు. గడిచిన ఐదేళ్లలో తిరుమలలో జరిగిన అక్రమాలపై త్వరలోనే ఒక నివేదిక వస్తుందని.. అది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత దోపిడీ జరిగిందో నిజా నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు.


శాంతికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?

ఇదే సమయంలో దేవాదాయ శాఖా మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశంపైనా మంత్రి ఆనం స్పందించారు. అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విల్లా కొనుక్కోవాలి అని కమీషనర్‌ని పర్మిషన్ అడిగిందని.. తన శాఖ పరిధిలో లేని పనులు చేసి అన్ని తానై వ్యవహరించని మంత్రి ఆరోపించారు. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న కారణంతోనే శాంతిని సస్పెండ్ చేశామన్నారు. పూర్తి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ప్రేమ సమాజ భూముల మీద ప్రేమ పుడుతుందని అనుకోలేదని.. ఆ పేరే మారిపోయే విధంగా చేశారని గత ప్రభుత్వంపై మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది దుష్టులు ప్రేమ సమాజం పేరును భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 12 , 2024 | 08:03 PM

Advertising
Advertising
<