ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Durgesh : పర్యాటక పాలసీతో అద్భుతాలు

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:25 AM

రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ అద్భుతాలు సృష్టించబోతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

  • పెట్టుబడిదారులకు అండగా ఉంటాం

  • భయంలేకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టండి

  • పర్యాటకానికీ పరిశ్రమల తరహా రాయితీలు

  • పర్యాటక పెట్టుబడిదారుల భేటీలో మంత్రి దుర్గేష్‌

  • ఏపీ పర్యాటక పాలసీ-2024 విడుదల

విజయవాడ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ అద్భుతాలు సృష్టించబోతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి రాయితీలు ఇవ్వడం ద్వారా రానున్న రోజులలో టూరిజం హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారబోతోందన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి రూ. 25 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 5 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, పర్యాటకుల సంఖ్య పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల మేళవింపుతో రూపొందించిన పాలసీ పర్యాటక రంగానికి నభూతో నభవిష్యతి అని వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని హోటల్‌ వివంతలో సీఐఐ, ఏపీ ఛాంబర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి దుర్గేష్‌ పాల్గొన్నారు. నూతన పర్యాటక పాలసీ-2024ను ఆయన విడుదల చేశారు. పర్యాటక పాలసీకి సంబంధించి ముందుగా ఏపీటీడీసీ ఎండీ అమ్రపాలి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. పాలసీ విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘పెట్టుబడిదారుల ఆలోచనలు, ప్రతిపాదనలకు అనుగుణంగా పాలసీని తీసుకువచ్చాం. ఏపీలో ఇక పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. నూతన పాలసీ ద్వారా రూ.25వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రక వారసత్వ, ప్రకృతి సంపద, నదులు ఉన్నాయి. వీటి ఆధారంగా దేశ విదేశాలకు టూరిజం హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆశయం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కుదేలైన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది.


పర్యాటకంలో మూడవ స్థానంలో ఉన్న రాష్ర్టాన్ని నెంబర్‌ 1 స్థానంలో నిలపాలన్నది మా ఆశయం. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయటంతో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను కూడా నెలకొల్పుతాం. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చిన వారు కనీసం ఐదు రోజులైనా అక్కడ ఉండే విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగా ఆలయ, సాహస, పర్యావరణ, గ్రామీణ, ఆరోగ్య, వ్యవసాయ టూరిజం వంటి విధానాలు తీసుకు వస్తున్నాం. రాష్ట్రంలో 3 పర్యావరణ, 10 ఆలయ, 2 బుద్ధిస్ట్‌, 4 నదీ పర్యాటకం, 2 క్రూయిజ్‌ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో హోటళ్ల గదుల సంఖ్యను 50 వేలకు పెంచబోతున్నాం. కేంద్ర నుంచి అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ నూకసాని బాలాజీ పర్యాటక శాఖ సెక్రటరీ వి.వినయ్‌చంద్‌, సీఐఐ చైర్మన్‌ రామకృష్ణ, ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షులు పీ భాస్కరరావు, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 03:25 AM