Minister Kollu Ravindra : సొమ్ము చెల్లిస్తే దొంగ దొర అవుతాడా?
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:45 AM
దొంగతనం చేసిన దొంగ ఆ సొమ్ము చెల్లిస్తే దొర అయిపోతాడా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
పేర్నిపై కొల్లు రవీంద్ర విసుర్లు
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): దొంగతనం చేసిన దొంగ ఆ సొమ్ము చెల్లిస్తే దొర అయిపోతాడా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంగళవారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘బందరులో పేర్ని నానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం రేషన్ బియ్యం నిల్వ చేసింది. అందులో బియ్యం మాయం అయ్యాయి. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేర్ని వాటిని బొక్కారు. రేషన్ బియ్యాన్ని గోదాముల నుంచి అక్రమంగా తరలించి పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముకొన్నారు. ఇప్పుడు దొంగతనం బయటపడిన తర్వాత డబ్బు కడతాం అంటున్నారు. డబ్బు కడితే దొంగ దొర అవుతారా? చేసిన దొంగతనం మాఫీ అవుతుందా? ఈ విషయం బయటపడగానే పేర్ని నాని కుటుంబం మొత్తం బందరు నుంచి పారిపోయింది. నిన్న తిరిగి వచ్చి హడావుడి చేస్తున్నారు. చేసిన దొంగతనం ఎటూపోదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని రవీంద్ర అన్నారు.
Updated Date - Dec 18 , 2024 | 06:45 AM