AP News: ఏపీ పోలీసుల తీరుపై కేంద్రం సీరియస్.. డీజీపీకి ఘాటు లేఖ..!
ABN, Publish Date - May 23 , 2024 | 05:14 PM
ఆంధ్రప్రదేశ్ పోలీసుల(Andhra Pradesh Police) తీరుపై కేంద్ర ప్రభుత్వం(Central Government) చాలా సీరియస్ అయ్యింది. వారి అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను రాష్ట్ర డీజీపీకి(AP DGP) పంపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విజయవాడలో(Vijayawada) రోడ్ షో నిర్వహించారు.
విజయవాడ, మే 23: ఆంధ్రప్రదేశ్ పోలీసుల(Andhra Pradesh Police) తీరుపై కేంద్ర ప్రభుత్వం(Central Government) చాలా సీరియస్ అయ్యింది. వారి అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలతో లేఖను రాష్ట్ర డీజీపీకి(AP DGP) పంపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విజయవాడలో(Vijayawada) రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్‌గా స్పందించింది. బాధ్యులపలై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఘాటైన లేఖ పంపింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు.. ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్స్ ఎగురవేశారు. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది.
పీఎం భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ ముందుగానే ప్రధాని రోడ్ షో ప్రాంతం నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు వినిపించుకోలేదు. ప్రధాని రోడ్ షోకు 45 నిమిషాల ముందు డ్రోన్‌లను గుర్తించిన ఎస్పీజీ.. ఒక డ్రోన్‌ను డిస్‌ఫ్యూజ్ చేసేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు చెప్పినా.. వారు పెద్దగా పట్టించుకోలేదు. డ్రోన్స్‌ను ఎగురవేశారు. దీనిపై కేందర ప్రభుత్వం, ఎస్పీజీ సీరియస్ అఅయ్యింది. ఇది భద్రతా వైఫల్యమేనని కేంద్ర హోంశాఖ ఇప్పుడు తేల్చింది. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరి దీనిపై రాష్ట్ర డీజీపీ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 23 , 2024 | 05:15 PM