ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - May 06 , 2024 | 12:48 PM

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన నివాసానికి రాలేదని ఆగ్రహం తెచ్చుకున్న ముద్రగడ.. ఆ తరువాత వైసీపీలో చేరి పవన్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన కూతురికే నచ్చడం లేదు. దీంతో ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ తన తండ్రి వైసీపీ అధినేత జగన్ ఆడిస్తున్నట్టు ఆడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు

కాకినాడ: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన నివాసానికి రాలేదని ఆగ్రహం తెచ్చుకున్న ముద్రగడ.. ఆ పార్టీలో చేరే విషయమై మనసు మార్చుకుని ఆ తరువాత వైసీపీలో చేరి పవన్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన కూతురు క్రాంతి భారతికే నచ్చడం లేదు. దీంతో ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ తన తండ్రి వైసీపీ అధినేత జగన్ ఆడిస్తున్నట్టు ఆడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో ముద్రగడకు తన కూతురిపై విపరీతమైన కోపం వచ్చింది.

AP Elections: ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్


అంతేకాకుండా తన కూతురు తనకు వ్యతిరేకమవడానికి తన వ్యవహార శైలి కారణమన్న విషయాన్ని పక్కనబెట్టి పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై సైతం ముద్రగడ నోరు పారేసుకున్నారు. పవన్ తన కూతురిని అనుకూలంగా మార్చుకున్నారని.. ఆయన తన ముగ్గురి భార్యలను పరిచయం చేయగలరా? అని ప్రశ్నించారు. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ ఏమి జరిగినా తన ఇంటికి తన కూతుర్ని పంపించవద్దని చెప్పారు. అలాగే వస్తానని అనకని తన కూతురుకు సైతం చెప్పారు. మెగా ఫ్యామిలిలో ఎవరు పబ్బుల్లో తిరుగుతున్నారు? ఎవరు ఎవరితో ఉంటున్నారో బయటకు చెప్పాలన్నారు.పవన్ మీ ఇంటికి వస్తానని చెప్పారని మీడియా చెప్పగా.. నో ఎంట్రీ అని ముద్రగడ సమాధానం చెప్పారు.

ఇవి కూడా చదవండి...

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

YSRCP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వారికి వైసీపీ నేతల డబ్బు ఎర.. అదేంటని ప్రశ్నిస్తే..

Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 01:18 PM

Advertising
Advertising