AP News: నరసరావుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె వివాదం
ABN , Publish Date - Jan 02 , 2024 | 08:46 AM
నరసరావుపేటలో మున్సిపల్ కార్మికులు సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా.. కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది.

పల్నాడు: నరసరావుపేటలో మున్సిపల్ కార్మికులు సమ్మె వివాదం రాజుకుంది. సమ్మె చేస్తున్న కార్మికులకు పోటీగా.. కార్మికులను తెప్పించి చెత్త తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఏడాది కాలంగా మూలనపడ్డ క్లాప్ ఆటోలను అధికారులు రంగంలోకి దింపుతున్నారు. కొత్త కార్మికులను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో కొత్త కార్మికులతో చెత్త తరలించే ప్రయత్నం జరుగుతోంది.