ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Machilipatnam : బందరు వైసీపీ కార్యాలయానికి నోటీసు

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:05 AM

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు.

  • 2 ఎకరాల్లో ప్యాలెస్‌ తరహా నిర్మాణం

  • అనుమతుల్లేకుండా అడ్డగోలుగా నిర్మాణం

  • ప్రభుత్వం మారగానే ఉత్తుత్తి దరఖాస్తు

  • అప్పటికే 90 శాతం భవన నిర్మాణం పూర్తి

  • పేర్నినాని పేరిట నోటీసులు జారీ

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 28 : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. జగన్‌ ఐదే ళ్ల పాలనలో ప్యాలె్‌సల తరహాగా కట్టిన వైసీపీ కార్యాలయాల్లో ఇదీ ఒకటి. కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి దాదాపుగా నిర్మాణం పూర్తయింది. దీనిని కోట్లాది రూపాయల విలువగల రెండెకరాల భూమిలో నిర్మించారు. అధికారం అండతో అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా కార్యాలయ భవనం నిర్మించారు. అక్రమమని తెలిసినా అధికారులు ఆనాడు ఏమీ చేయలేకపోయారు. నిబంధనల ప్రకారం,

1000 చదరపు గజాల విస్తీర్ణం దాటిన నిర్మాణాలకు ‘ముడా’ (మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అఽథారిటీ) అనుమతులు తీసుకోవాలి. అయినా.. అడ్డగోలుగా నిర్మించేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి....టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆ పార్టీ నేతలు దరఖాస్తు చేశారు. అప్పటికి 90 శాతం నిర్మాణం పూర్తయిపోయింది. అయితే, వైసీపీ నేతలు ఇచ్చిన దరఖాస్తులో అవకతవకలు ఉన్నట్టు ‘ముడా’ అధికారులు గుర్తించారు.

దాంతో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నానికి నోటీసులు జారీ చేసేందుకు వెళ్లారు. నాని కార్యాలయం వద్ద లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి గురువారం సాయంత్రం నోటీసులు అందజేశారు. ‘‘మచిలీపట్నం వైసీపీ కార్యాలయ భవనం 1000 చదరపు గజాలకు మించి ఉంది. అందువల్ల ‘ముడా’ అధికారుల అనుమతి తప్పనిసరి. దీంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశాం. వారిచ్చే సమాధానాన్ని అనుసరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని మచిలీపట్నం కమిషనర్‌ బాపిరాజు తెలిపారు.

Updated Date - Jun 29 , 2024 | 05:05 AM

Advertising
Advertising