ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhuvaneswari: ముగిసిన భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన.. చివరగా ఎవరిని కలిశారంటే?

ABN, Publish Date - Apr 13 , 2024 | 01:06 PM

Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర ముగిసింది.

Nara Bhuvaneswari Nijam Gelavali Tour

అమరావతి, ఏప్రిల్ 13: టీడీపీ అధినేత నారా చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ముగిసింది.

Sukesh Chandrashekhar: వారందరి బండారం బయటపెడతా.. సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ..


6 నెలలు.. 47 రోజులు.. 9,080 కి.మీ...

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను పరామర్శించాలనే ఉద్దేశంలో ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి యాత్రను మొదలుపెట్టారు. గతేడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. దాదాపు ఆరు నెలల పాటు నిజం గెలివాలి కొనసాగింది. మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమంలో సాగింది. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన 203 మంది కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చారు. అంతే కాకుండా వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలుస్తుందంటూ భరోసా ఇచ్చారు.


చనిపోయిన కార్యకర్తల పిల్లల్లో చదువుకుంటున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందించే బాధ్యత కూడా భువనమ్మ చేపట్టారు. 14 విడతల్లో, 47 రోజులు పాటు భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగింది. 150 పైబడి ప్రసంగాలతో ప్రజల్లో భువనేశ్వరి చైతన్యం నింపారు. నిజం గెలవాలి కార్యక్రమం మొత్తం మీద వివిధ సామాజికవర్గాల ప్రజలతో 9 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. భువనేశ్వరి.6 నెలల సమయం, 14 విడతల కార్యక్రమం, 47 రోజుల ప్రయాణంలో 9,080 కిలోమీటర్ల దూరం భువనేశ్వరి ప్రయాణించారు.

Hyderabad: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్..


ముగింపు సభ

నేడు చివరి రోజు కావడంతో తిరువూరులో ‘‘నిజం గెలవాలి’’ ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు తిరువూరులో పూర్ణయ్య స్థలం వద్ద నిజం గెలవాలి ముగింపు సభ జరుగనుంది. నిజంగా గెలవాలి ముగింపు సభకు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.


ఇవి కూడా చదవండి..

AP Politics: పురందేశ్వరి పేరుతో ఫేక్‌ ప్రకటన.. జగన్‌పై బీజేపీ నేత సీరియస్

Lok Sabha Elections:హైదరాబాద్ సీటుపై కాంగ్రెస్ నిర్ణయం అదేనా.. ?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 01:33 PM

Advertising
Advertising