ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh: మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారు.. సీఎం జగన్‌పై లోకేశ్ స్ట్రాంగ్ కామెంట్స్..

ABN, Publish Date - Jan 28 , 2024 | 01:58 PM

మంగళగిరిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

మంగళగిరిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల ముందు మద్యం దుకాణాలు తీసేస్తామన్న జగన్ మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారని విమర్శించారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, చివరకు మద్యం ధర కూడా పెంచి పేదల బతుకులను నాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ సమక్షంలో పలువురు నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి నారా లోకేశ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు మంగళగిరి సీటు కేటాయించారు. ఈ తక్కువ సమయంలో నేనేంటనేది ప్రజలకు అర్దం కాలేదు. నేనూ ప్రజల సమస్యలు పూర్తిగా అర్దం చేసుకోలేకపోయాను. అందుకే ఓడిపోయాను. ఆ ఓటమే నాలో కసి పెంచింది. ప్రజల కోసం ప్రజలతోనే కలిసి నడిచాను. గతంలో ఓడిన అభ్యర్దులు ఎవరూ ఇలా ప్రజలకు సేవ చేయలేదు. నేను ఓడిపోయినా ప్రభుత్వానికి ధీటుగా ఇక్కడే సేవా కార్యక్రమాలు చేశాను.

- నారా లోకేశ్, టీడీపీ నేత


మంగళగిరి నియోజకవర్గానికి నిధులు కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఫేక్ పట్టాలు సృష్టించి మాయ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మొత్తం మంగళగిరి వైపే చూసేలా బాధ్యత తీసుకుంటానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2024 | 01:59 PM

Advertising
Advertising