Narreddy Rajasekhar Reddy: వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారు..
ABN, Publish Date - May 06 , 2024 | 08:08 PM
హత్య జరిగిన రోజు ఉదయం తనకు ఫోన్ చేసిన పీఏ కృష్ణారెడ్డి.. వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో..
ABN Big Debate: హత్య జరిగిన రోజు ఉదయం తనకు ఫోన్ చేసిన పీఏ కృష్ణారెడ్డి.. వివేకా రక్తవాంతులతో చనిపోయాడని చెప్పారని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్‌లో.. డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. వివేకా హత్య కేసుపై పలు సంచలన విషయాలు తెలియజేశారు. రాజశేఖర్ రెడ్డి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 6:15కి నాకు ఫోన్‌కాల్ వచ్చింది. పీఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి.. వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు చెప్పాడు. మొదట్లో కృష్ణారెడ్డి పాత్ర లేదనుకున్నా. కానీ, అతడి పాత్ర కూడా ఉందని తర్వాత తెలిసింది. వివేకా రాసిన లేఖను కృష్ణారెడ్డి చదివి వినిపించాడు. నేను వచ్చేదాకా లేఖను దాచిపెట్టాలని కృష్ణారెడ్డికి చెప్పా. లెటర్ దాచినందుకు శిక్ష పడినా పర్లేదు అనుకున్నా. అయితే లెటర్‌ను చూశాక వివేకాను హత్య చేసినట్లు అర్థమైంది. వివేకాకు కృష్ణారెడ్డి అధికారిక పీఏ కాదు. కేవలం ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చూసేవాడు’’.. అని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
వివేకా హత్య కేసుపై వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ తన తండ్రి హత్య జరిగిన రోజు రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌కాల్ వచ్చినట్లు తనకు తెలుసని చెప్పారు. అప్పటికే పీఏ కృష్ణారెడ్డి.. అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాడని తెలిపారు. తన తండ్రి చనిపోయిన విషయం తాము చెప్పకముందే.. పీఏ కృష్ణారెడ్డి తన తల్లికి తెలియజేశాడని పేర్కొన్నారు. ఇలాంటి పోరాటం నాకు తెలిసిన విద్య కాదని.. ఏమీ తెలీదు కాబట్టే ఇక్కడిదాకా పోరాడానని చెప్పారు. పోరాటంలో చాలామంది సలహాలు తీసుకున్నానని సునీత పేర్కొన్నారు.
Updated Date - May 06 , 2024 | 08:08 PM