ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: టీడీపీలోకి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి దంపతులు..?

ABN, Publish Date - Aug 09 , 2024 | 09:57 AM

జిల్లా రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి ఆయన‌ సతీమణి, జెడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నివాసానికి విజయకుమార్ రెడ్డి, అరుణమ్మ దంపతులు వెళ్లడంతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లావ్యాప్తంగా విస్తృత చర్చలు నడుస్తున్నాయి.

నెల్లూరు: జిల్లా రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి ఆయన‌ సతీమణి, జెడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నివాసానికి విజయకుమార్ రెడ్డి, అరుణమ్మ దంపతులు వెళ్లడంతో నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లావ్యాప్తంగా విస్తృత చర్చలు నడుస్తున్నాయి.


తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీ సాధించడం, ఫ్యాన్ పార్టీ కేవలం 11స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీ నేతలు కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య సైతం ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. వీరంతా కూటమిలోని ఏదో పార్టీలో చేరే అవకాశం ఉంది.


అయితే ఆనం విజయకుమార్ రెడ్డి దంపతులు పార్టీకి రాజీమానా చేస్తున్నారంటూ వచ్చే వార్తలను ఫ్యాన్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈనెల 10వ తేదీన జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రి నారాయణను ఆహ్వానించేందుకే వారు ఆయన నివాసానికి వెళ్లినట్లు చెప్తున్నారు. ఒకవేళ వారు టీడీపీలోకి చేరితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్లు అవుతుంది.

Updated Date - Aug 09 , 2024 | 09:57 AM

Advertising
Advertising
<