ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: సోమశిల డ్యామ్‌ను కాపాడేందుకు కూటమి సర్కార్ కసరత్తు...

ABN, Publish Date - Jul 13 , 2024 | 01:49 PM

Andhrapradesh: జగన్ సర్కార్ హయాంలో గాలికి వదిలేసిన సోమశిల డ్యామ్‌ను కాపాడేందుకు కూటమి సర్కార్ ముందుకు వచ్చింది. డ్యామ్ రక్షణ‌కు అవసరమైన చర్యలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రేపు (ఆదివారం) సోమశిల డ్యాంను మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పరిశీలించనున్నారు.

Somasila Dam

అమరావతి, జూలై 13: జగన్ సర్కార్ (Jagan Government) యాంలో గాలికి వదిలేసిన సోమశిల డ్యామ్‌ను కాపాడేందుకు కూటమి సర్కార్ ముందుకు వచ్చింది. డ్యామ్ రక్షణ‌కు అవసరమైన చర్యలపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రేపు (ఆదివారం) సోమశిల డ్యాంను మంత్రులు నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramnarayana Reddy), పొంగూరు నారాయణ (Ponguru Narayana) పరిశీలించనున్నారు.

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి


జగన్ సర్కార్ తీరిది...

కాగా.. జగన్ పాలనలో సోమశిల డ్యామ్ నిర్వహణను గాలికి వదిలేసింది. నెల్లూరు జిల్లాకు తలమానికమైన సోమశిల డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం ఐదేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం గ్రీజు, జనరేటర్‌కి అవసరమైన డీజిల్‌కి కూడా నిధులు కేటాయించని పరిస్థితి. ఈ క్రమంలో వరదల తాకిడికి అప్రాన్ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. ఎర్త్ డ్యామ్, సిల్ప్‌వే, జనరల్ మెయింటెన్స్‌కి కూడా సిబ్బంది లేకుండాపోయారు. కనీసం 12 మంది వాచ్‌మెన్లలో ఒక్కరిని కూడా జగన్ ప్రభుత్వం నియమించకుండా నిర్లక్ష్యం చేసింది.

Raj Tarun-Lavanya Case: అరగంట తర్వాత ఉండను.. లావణ్య మెసేజ్..


తుపాను సమయంలో డీజిల్‌కి డబ్బులు లేక రైతుల ట్రాక్టర్లలో నుంచి డీజిల్ సేకరించే పరిస్థితి కల్పించింది గత సర్కార్. సోమశిల డ్యాంని గతంలో కేంద్ర బృందాలు రెండు సార్లు పరిశీలించాయి. డ్యాంకి తీవ్ర ప్రమాదం తప్పదని కేంద్ర బృందాలు హెచ్చరించాయి కూడా. అయినప్పటికీ కేంద్ర బృందాల హెచ్చరికలని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రోప్ నిర్మాణాలకు కూడా రూ.1.5కోట్లు కేటాయించలేదు. వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న సోమేశ్వరాలయం గురించి కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

NV Ramana: చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామం


ఇవి కూడా చదవండి..

Vijayawada: ఓవైపు ఆషాడ మాసం.. మరోవైపు భారీ వర్షం... వెరసి భారీగా ట్రాఫిక్ జామ్

School Building Collapse: కూలిన స్కూల్ బిల్డింగ్.. 22 మంది విద్యార్థులు మృతి, 100 మందికిపైగా గాయాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 01:49 PM

Advertising
Advertising
<