ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: నెల్లూరు జిల్లాలో సంచలనం.. కలువాయి చేపల దొంగల్లో వైసీపీ నేత..!

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:12 AM

కలువాయి వైసీపీ జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డితో సహా 24మంది చేపల దొంగలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై అయ్యప్ప వెల్లడించారు. వైసీపీ హయాంలో కలువాయి చెరువులో రూ.1.25కోట్ల విలువ చేసే చేపలను వీరంతా అక్రమంగా వేటాడి సొమ్ము చేసుకున్నట్లు మత్స్యశాఖ కావలి ఏడీ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.

నెల్లూరు: కలువాయి వైసీపీ జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డితో సహా 24మంది చేపల దొంగలపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై అయ్యప్ప వెల్లడించారు. వైసీపీ హయాంలో కలువాయి చెరువులో రూ.1.25కోట్ల విలువ చేసే చేపలను వీరంతా అక్రమంగా వేటాడి సొమ్ము చేసుకున్నట్లు మత్స్యశాఖ కావలి ఏడీ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అప్పట్లో చేపల చోరీ వ్యవహారాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. నిందితుల్లో వైసీపీ జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.


2021నుంచి కలువాయి చెరువుని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ కావలి ఏడీ శ్రీనివాసులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కారణంగా మత్స్యకారులకు చెరువును లీజుకి ఇవ్వలేదని ఆయన తెలిపారు. అయితే రెండు సంవత్సరాల నుంచి ప్రస్తుత పాలకవర్గం, కొంతమంది కలిసి రాత్రి వేళల్లో అక్రమంగా చేపలు వేట సాగించారని తన దృష్టికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై స్వయంగా వెళ్లి చెరువు జాలర్లను సహా పలువురిని విచారించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.


అయితే సొసైటీ మాజీ అధ్యక్షుడు వజ్రాల శ్రీనివాసులు, కొంతమంది సభ్యులు ఇదే విషయాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారని ఆయన చెప్పారు. ఘటనపై విచారణ జరిపి అక్రమంగా చేపలు పట్టిన 24మందిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మత్స్యశాఖ కావలి ఏడీ శ్రీనివాసులు వెల్లడించారు.

Updated Date - Aug 03 , 2024 | 11:12 AM

Advertising
Advertising
<