ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: మనమంతా బానిసలం.. జగన్ రాజు.. ప్రశ్నిస్తే వేధిస్తారు

ABN, Publish Date - Mar 02 , 2024 | 01:54 PM

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు.

నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prbhakar Reddy) ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి (Prashanthi Reddy) టీడీపీ (TDP)లోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. నేడు నెల్లూరు (Nellore) సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ (VPR) లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు. సొంత డబ్బు‌ ప్రజలకి ఖర్చుపెట్టే మనస్థత్వం వీపిఆర్‌దని చంద్రబాబు కొనియాడారు.

AP News: విహారయాత్రలో విషాదం.. సముద్రంలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక సైకో అని విమర్శించారు. మనమంతా బానిసలమని.. ఆయనేమో రాజని ఎవరైనా ప్రశ్నిస్తే వేధిస్తుంటారన్నారు. చేస్తానన్న పనులు ఎందుకు చేయవని జగన్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి (MLA Kotamreddy) ప్రశ్నిస్తే వేధించారన్నారు. దీంతో ఏం చేసుకుంటావో చేసుకోమని కోటంరెడ్డి పోరాడారని తెలిపారు. అహంకారంతో ఇష్టానుసారంగా విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కోసం, యువత భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డల కోసం అందరూ ఆలోచించాలని చంద్రబాబు తెలిపారు.

AP Politics: నెల్లూరులో వైసీపీకి భారీ షాక్‌... టీడీపీలోకి వేమిరెడ్డి

Gaddam Prasad: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 01:55 PM

Advertising
Advertising