ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వైసీపీకి ఓటేస్తే విధ్వంసమే.. ఆనం సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Mar 28 , 2024 | 03:22 PM

ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana reddy) అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు..

Anam Ramanarayana Reddy

నెల్లూరు, మార్చి 28: ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana reddy) అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు ఆనం. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రజా దర్భారు భవనం కూల్చివేతతో వైసీపీ పాలన ప్రారంభమైందని విమర్శించారు.

అంతా దుర్మార్గపు పాలన..

ప్రకృతి విపత్తుల నుంచి నుండి కాపాడే సంగం కొండని మాయం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వైసీపి పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి ఆధీనంలో ఉన్నప్పటికీ వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆనం విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నిధుల లేక నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ భూసేకరణ పనులు పూర్తిగా ఆగిపోయాయని అన్నారు.

Also Read: అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 03:22 PM

Advertising
Advertising