ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం

ABN, Publish Date - Sep 27 , 2024 | 01:21 PM

Andhrapradesh: ‘‘గత పాలకుల్లాగా మేమూ ఉండాలనుకోవడం మీ మూర్ఖత్వం. క్షమాపణలు చెప్పని వారు సిగ్గుపడాలి’’ అని మండిపడ్డారు. శాస్త్రలు, ధర్మాలకి క్షమాపణలు చెప్పకుండా సవాళ్లు విసురుతున్నారన్నారు. ఆగమ, వైదిక శాస్త్రల అనుసారం తాము నడుచుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

Minister Anam Ramnarayana Reddy

నెల్లూరు, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో అపవిత్ర కార్యక్రమానికి వైసీపీ పూనుకుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది (Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. యావత్ హిందువులు, హిందుత్వాన్ని గౌరవించే వారంతా ఆవేదన చెందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ల్యాబ్ నివేదికలు పరిశీలించి, అందరి అభిప్రాయాన్ని తీసుకున్నారని... జరిగిన తప్పిదాన్ని సరి చేసేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కొత్తగా నెయ్యి, సరుకులు మార్చామన్నారు. బాధ్యులు, తప్పులపై నివేదికలు ఆధారంగా ఏడు మంది సిబ్బందితో సిట్ విచారణ చేపట్టామన్నారు. జరిగిన అపవిత్రంపై గత సభ్యులు పశ్చతాపపడాలని.. హిందూ మత ధర్మానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Wolf Attack: 12 రోజుల తర్వాత జనాల సమక్షంలో మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరికి గాయాలు


మాజీ టీటీడీ చైర్మన్ ప్రమాణాలు చేస్తామని చెప్పి.. హైకోర్టుని అశ్రాయించారన్నారు. విజిలెన్స్ విచారణ జరగకూడదనే వారి మాటలకి ఏం విశ్వశనీయత ఉందని ప్రశ్నించారు. ఆచార సంప్రదాయలను కరుణాకర్ రెడ్డి తప్పు పడుతున్నారని మండిపడ్డారు. ‘‘గత పాలకుల్లాగా మేమూ ఉండాలనుకోవడం మీ మూర్ఖత్వం. క్షమాపణలు చెప్పని వారు సిగ్గుపడాలి’’ అని మండిపడ్డారు. శాస్త్రలు, ధర్మాలకి క్షమాపణలు చెప్పకుండా సవాళ్లు విసురుతున్నారన్నారు. ఆగమ, వైదిక శాస్త్రల అనుసారం తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.

Devara movie: ‘దేవర’ చిత్రం విడుదలలో అపశృతి


తిరుమల నిబంధన ప్రకారం హైందవ ధర్మాన్ని నమ్ముతున్నామని చెప్పడం ప్రక్రియన్నారు. హైందవ ధర్మ డిక్లరేషన్ పాటించడంలో జగన్‌కు అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. గతంలో మత విశ్వాసన్ని గౌరవిస్తామని రాష్ట్రపతిగా అబ్దుల్ కలం, సోనియా గాంధీ సంతకం చేశారని గుర్తుచేశారు. వైసీపీలో ఉన్నవారు అబ్దుల్ కలాం, సోనియా గాంధీ కంటే గొప్పవారా అని నిలదీశారు. ఇతర దేశస్థులు కూడా సంతకం పెడుతుంటే, వైసీపీ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆలయ నిబంధనలకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘‘సంతకం పెట్టమంటే, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంత పెద్ద వారైనా, గొప్పవారైనా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాల్సిందే. ఏడుకొండలు లేవన్న వ్యక్తులు, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు. ఆంజనేయ స్వామి చేయి తీసేశారు, రాముల వారి తల తీసేశారంటే పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్ది. తిరుమల విధానం ప్రకారం నడుచుకోకపోతే తిరుమలలో అడుగు పెట్టనివ్వం’’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

ACB: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 01:23 PM