ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Road Accident: వేర్వేరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

ABN, Publish Date - May 19 , 2024 | 10:21 AM

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ముగ్గురు మృతి (Three Died) చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై (Mumbai Highway) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీ (Lorry)ని ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీ కొంది. కనిగిరి నుంచి నెల్లూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి‌ గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు.


ప్రకాశం జిల్లా: కనిగిరి మండలం, దేవాంగ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, ఈవీఎంలు భద్రపరిచిన నిమ్రా కాలేజీ వెనక హైదరాబాద్ హైవేకి ఆనుకుని ఉన్న సడక్ రోడ్డు వద్ద అధికారులు పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. హైవేపై రోడ్డు దాటుతుండగా డ్యూటీలో ఉన్న సీపీఎస్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ రమణ మీదకు కారు దూసుకుపోయింది. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్తున్న కారు.. ఈ ఘటనలో ఏఎస్ఐ రమణకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 10:26 AM

Advertising
Advertising