ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాం: వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది

ABN, Publish Date - May 13 , 2024 | 08:02 AM

నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్‌ఆర్‌కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.

నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్‌ఆర్‌కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి (Kutami MP Candidagte) వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది (Vemireddy Prakabhakar Reddy) దంపతులు ఓటు (Vote) హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు. అలాగే టీడీపీ (TDP) అభ్యర్థులందరూ ఘన విజయం సాధించాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.


కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి (Vemireddy Prashanthi) మాట్లాడుతూ.. కోవూరులో ప్రజలు తెలుగుదేశం పక్షాన ఉన్నారని, దేవుడి ఆశీస్సులతో కోవూరులో విజయం సాధించబోతున్నానని ఆమె అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) స్థానాలకు పోలింగ్ (Polling) సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.


మొత్తం ఓట‌ర్లు 4,14,01,887 మంది.

పురుషులు - 2,03,39,851

మ‌హిళ‌లు - 2,10,58,615

థ‌ర్డ్ జెండ‌ర్ - 3421

మొత్తం పోలింగ్ కేంద్రాలు - 46389

స‌మ‌స్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 12438

వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు - 34651(74.7 శాతం)

అనంత‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలలో 100 శాతం వెబ్ కాస్టింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. వంద శాతం వెబ్ కాస్టింగ్ కేంద్రాలు - 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.


పార్లమెంట్ బ‌రిలో ఉన్న అభ్యర్థులు - 454

అసెంబ్లీ బ‌రిలో ఉన్న అభ్యర్థులు - 2387

కాగా ఎంపీ అభ్యర్థులు విశాఖలో అత్యధికంగా 33 మంది పోటీలో ఉండగా.. అత్యల్పంగా రాజమండ్రిలో 12 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది ఉండగా.. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 గురు అభ్యర్దులు ఉన్నారు. ఎన్నిక‌ల విధుల్లో 5.26 ల‌క్షల మంది సిబ్బందిని అధికారులు నియమించారు. పోలీస్ సిబ్బంది 1,06,000 (295 కంపెనీలు సాయుధ బ‌ల‌గాలు)ని ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

కూటమిలో జోష్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 08:29 AM

Advertising
Advertising