YS Jagan: పిన్నెల్లిని జైలులో కలిసొచ్చాక వైఎస్ జగన్ ఇలా మాట్లాడారేంటి..?
ABN, Publish Date - Jul 04 , 2024 | 01:25 PM
ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయ్యి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. సుమారు అరగంటకు పైగా ములాఖత్ అయిన జగన్..
నెల్లూరు: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయ్యి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. సుమారు అరగంటకు పైగా ములాఖత్ అయిన జగన్.. బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలను చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నది జగనేనా..? అంటూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
కాగా.. పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో స్వయంగా ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జిల్లా కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. ఇక కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ రేంజిలో హెచ్చరించినదో అందరికీ తెలుసు. కానీ జగన్ మాత్రం అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడం గమనార్హం.
ఇంకా ఏమేం మాట్లాడారు..?
‘పిన్నెల్లిని అన్యాయంగా జైలులో పెట్టారు. పిన్నెల్లిపై హత్యా నేరం మోపారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదు. తల్లికి వందనం డబ్బులు ఏమయ్యాయి?. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు వేస్తామని.. చెప్పిన డబ్బులకు ఏమయ్యాయి?. ఇలాంటివి ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేస్తున్నారు. దాడులతో భయపెట్టి రాజకీయాలు చేయడం సరికాదు’ అని ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు.
Updated Date - Jul 04 , 2024 | 02:10 PM