ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mothers Day: అమ్మ మీద అలిగిన జగన్..!

ABN, Publish Date - May 12 , 2024 | 08:22 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లి వైయస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

YS Jagan Mohan Reddy

సోషల్ మీడియాలో చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లి వైయస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైయస్ కుటుంబంతో వైయస్ జగన్ రెడ్డి రక్తసంబంధాలు సైతం అడ్డంగా తెంచుకొని రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

కన్నతల్లి వైయస్ విజయమ్మపై జగన్ రెడ్డి అలిగారని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలోనే వైయస్ విజయమ్మకు ఆయన తొలిసారిగా మదర్స్ డే శుభాకాంక్షలు ఎక్స్ వేదికగా తెలపలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

LokSabha Elections: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు ప్రకటించిన కేజ్రీవాల్


అమ్మ మీద ప్రేమ ఉన్నది ఎవరికీ..?

మరోవైపు మదర్స్ డే సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్‌సభ అభ్యర్థి వైయస్ షర్మిల తన తల్లి వైయస్ విజయమ్మకు ఈ రోజు మదర్స్ డే శుభాకాంక్షలు ఎక్స్ వేదికగా తెలియజేశారు.

ఈ నేపథ్యంలో అమ్మ మీద ప్రేమ ఉన్నది ఎవరికంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఇదే అంశంపై ఉమ్మడి కడప జిల్లాలో ఓ చర్చ అయితే వాడి వేడిగా జోరందుకొందని సమాచారం.

Afghanistan floods: పెరుగుతున్న మృతుల సంఖ్య.. వేలాది ప్రజలు గల్లంతు


దెబ్బకొట్టిన విజయమ్మ

ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. దీంతో యూఎస్‌లో ఉన్న వైయస్ విజయమ్మ.. మే 11వ తేదీన తాను మాట్లాడిన వీడియో వదిలారు. కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన తన కుమార్తె వైయస్ షర్మిలకు మద్దతు తెలపాలని ఆ నియోజకవర్గ ప్రజలకు ఆమె విజ్జప్తి చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో వైయస్ విజయమ్మ ఎవరి బిడ్డపైపు నిలబడిందనేది సుస్పష్టమైందనే ఓ చర్చ జిల్లాలో సాగుతుంది.

Congress Party: ఖర్గే హెలికాఫ్టర్‌లో తనిఖీలు..

Read Latest National News And Telugu News

Updated Date - May 12 , 2024 | 11:13 PM

Advertising
Advertising