ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NTR Jayanthi: తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి.. అన్న ఎన్టీఆర్

ABN, Publish Date - May 28 , 2024 | 10:10 AM

తెలుగు ప్రజల ఆత్మబంధువు అన్న ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయన్నారు.

Chandrababu Naidu

అమరావతి: తెలుగు ప్రజల ఆత్మబంధువు అన్న ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు తెలిపారు.

CM Jagan: డికోడర్ ఇంటర్వ్యూలో ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్


పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం... ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.

Andhra Pradesh :క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

Read more AP News and Telugu News

Updated Date - May 28 , 2024 | 10:59 AM

Advertising
Advertising