ఏపీ హైకోర్టులో 2.47 లక్షల పెండింగ్ కేసులు
ABN, Publish Date - Dec 21 , 2024 | 06:34 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మెత్తం 2,47,097 కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
ఎంపీ పరిమళ్ నత్వాని ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ సమాధానం
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మెత్తం 2,47,097 కేసులు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 9,04,462 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఈ నెల 19న మేఘ్వాల్ రాజ్యసభకు సమాచారం అందించారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 623 మంది న్యాయాధికారులు ఉండాల్సి ఉండగా 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అలాగే సుప్రీం కోర్టులో 82,640 పెండింగ్ కేసులు ఉండగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో 61,80,878, జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 4,62,34,646 పెండింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.
Updated Date - Dec 21 , 2024 | 06:34 AM