ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan kalyan: జగన్.. కాచుకో.. సిద్ధం సిద్ధం అంటే యుద్ధాన్ని ఇస్తా.. పవన్ సెన్సేషనల్ కామెంట్స్..

ABN, Publish Date - Feb 28 , 2024 | 08:47 PM

తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన తెలుగు జన విజయ కేతనం సభలో సీఎం జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌.. నేనూ తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. సంస్కారం ఉన్నందునే నీలా మాట్లాడలేకపోతున్నా.

తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన తెలుగు జన విజయ కేతనం సభలో సీఎం జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌.. నేనూ తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. సంస్కారం ఉన్నందునే నీలా మాట్లాడలేకపోతున్నా. ఓ సామాన్యుడు రాజకీయాలు చేస్తే తట్టుకోలేకపోతున్నారు. నిన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం నేను. వ్యూహాలు రచిస్తాం.. జగన్‌ కోటలు బద్ధలు కొడతాం. సిద్ధం సిద్ధం అంటున్నావ్.. కానీ నీకు నేను యుద్ధాన్ని ఇస్తున్నా. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు. వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు. మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే ఊరుకునేది లేదు. ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తోందని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.

నాతో నడిచే వాళ్లే.. నా వాళ్లు. ఓడినప్పుడు మీతోనే ఉన్నాను. గెలిచినా మీతోనే ఉంటాను. పవన్‌తో స్నేహం అంటే చచ్చేదాకా.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా. సలహాలు ఇచ్చే వాళ్లు కాదు- పోరాడేవాళ్లు కావాలి. శక్తి సామర్థ్యాలు చూసుకునే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాం. టీడీపీ-జనసేన సహకారంతోనే ప్రజలకు భవిష్యత్‌ ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నాం. టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజలకు భవిష్యత్‌ ఉంటుంది. ఒక్కడినే అంటున్న జగన్‌.. మా ఒక్క ఎమ్మెల్యేను ఎలా లాక్కున్నారు?. ఓ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం.

- పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు


రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలనేదే మా ఉద్దేశమన్న పవన్ కళ్యాణ్ 25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదన్నారు. ప్రజల భవిష్యత్‌ కోసం రోడ్లపైకి వచ్చినట్లు చెప్పారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, వర్గాలను జగన్‌ మోసం చేశారని ఫైర్ అయ్యారు. 2024లో మన విజయానికి ఈ జెండా సభనే సాక్ష్యంగా నిలుస్తుందని జనసేనాని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 08:47 PM

Advertising
Advertising