Narendra Modi: చంద్రబాబు పాలనలోనే ఏపీ నెంబర్ వన్
ABN , Publish Date - May 06 , 2024 | 05:43 PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రదాని పేర్కొన్నారు. అయితే అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో నెట్టింసిందని విమర్శించారు.
రాజమండ్రి, మే 06: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రదాని పేర్కొన్నారు. అయితే అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో నెట్టిందని విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. నా ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారాలంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేలపై నుంచే సరికొత్త చరిత్రను లిఖించబోతున్నామన్నారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
CM Naveen Patnaik: పగటి కలలు కంటున్న ప్రధాని మోదీ..
మే 13వ తేదీన ఏపీలో కొత్త ఆధ్యాయం మొదలు కాబోతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని చెప్పారు. ఈ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి గతి తప్పిందని.. ఇంకా చెప్పాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం బాట పట్టించిందని ప్రధాని మోదీ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు.
ఏపీలో మద్యనిషేధమని చెప్పి ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అలా అధికారంలోకి వచ్చి.. అనంతరం మద్యం సిండికెట్‌గా తయారయ్యారని విమర్శించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్‌లో పరిగెత్తిందన్నారు. మూడు రాజధానులు చేస్తామని.. ఒక్కటి కూడా నిర్మించలేదని తెలిపారు.
LokSabha Elections: రేపు గుజరాత్‌లో ఓటు వేయనున్న ప్రధాని మోదీ
అయితే మూడు రాజధానుల పేరుతో ఆంద్ర్రప్రదేశ్‌ను వైసీపీ లూటీ చేసిందని మోదీ ఆరోపించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదన్నారు. అయితే వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప.. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ మాత్రం అంతగా తెలియదని వ్యంగ్యంగా అన్నారు.
Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..
రాష్ట్ర ఖజానాను ఈ వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసిందని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం భావించిందని.. కానీ కేంద్ర నిధులను ఈ వైసీపీ సర్కారు అందుకో లేకపోయిందన్నారు. పోలవరానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందని ఈ సందర్బంగా మోదీ గుర్తు చేశారు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా ఆపేసిందన్నారు. మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని ఈ సందర్బంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
CM Naveen Patnaik: పగటి కలలు కంటున్న ప్రధాని మోదీ..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన యువతకు నెలవని మోదీ అభివర్ణించారు. అలాంటి రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి మాత్రం వంద శాతమని మోదీ చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే.. డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. కేంద్ర ప్రాజెక్టులను సైతం ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్బంగా సూచించారు. కాంగ్రెస్ పార్టీ తన 10 ఏళ్ల పాలనలో దేశాన్ని అథోగతి పాలు చేసిందని మోదీ గుర్తు చేశారు. అయితే ఈడీ ఈడీ అంటూ ఇండియా కూటమి ఒకటే గగ్గోలు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద గుట్టల కొద్దీ నగదు బయటపడుతోందన్నారు.
ఆ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద దొరికిన నగదును మిషన్లు సైతం లెక్క పెట్ట లేకపోతున్నాయన్నారు. ఇక జార్ఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద కట్టలకొద్దీ నగదు దొరికిందని మోదీ తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలోనే ఎందుకు గుట్టలుగా నగదు దొరుకుతోందని ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రశ్నించారు. అయితే ఈ గుట్టల కొద్దీ దొరుకుతున్న నగదుపై ఆ పార్టీ రాకుమారుడు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దోచుకున్న నగదును పేదలకు ఎలా పంచాలో ఆలోచిస్తున్నామన్నారు.
AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?
అయోధ్య రాముడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని మోదీ గుర్తు చేశారు. అయితే సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు.. అదీ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమని ప్రధాని మోదీ ఈ సందర్బంగా స్పష్టం చేశారు
Read Latest National News And Telugu news