ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Police Constable : బస్టాండ్‌లో ప్రయాణికుడిపై ఖాకీ క్రౌర్యం

ABN, Publish Date - Dec 30 , 2024 | 03:51 AM

చివరి బస్సు అందకపోవడంతో తెల్లవారేవరకూ బస్టాండ్‌లోనే విశ్రమించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అవుట్‌పోస్టు కానిస్టేబుల్‌ లాఠీతో చితకబాదాడు.

  • లాఠీతో చితకబాదిన అవుట్‌పోస్టు కానిస్టేబుల్‌

  • చివరి బస్సు అందక అక్కడే విశ్రమించిన ఫలితం

  • ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో దారుణం

  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

  • ఘటనపై విచారణ చేస్తున్నామన్న డీఎస్పీ

ఒంగోలు (కైం), డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): చివరి బస్సు అందకపోవడంతో తెల్లవారేవరకూ బస్టాండ్‌లోనే విశ్రమించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అవుట్‌పోస్టు కానిస్టేబుల్‌ లాఠీతో చితకబాదాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిందీ దారుణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం బి.నిడమానూరుకు చెందిన పిడతల మార్కు సొంత ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేస్తుంటారు. ట్రాక్టర్‌ మరమ్మతులకు గురవడంతో బాగు చేయించేందుకు శనివారం ఒంగోలులోని మెకానిక్‌ షెడ్డుకు తీసుకువచ్చారు. రాత్రి వరకూ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు మార్కు బస్టాండ్‌కు చేరుకున్నారు. అప్పటికే బస్సులన్నీ వెళ్లిపోవడంతో వేకువజామున తొలి బస్సుకు వెళ్దామని అక్కడే విశ్రమించేందుకు సిద్ధమయ్యారు. సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టుకుంటుండగా అవుట్‌ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ సురేశ్‌ వచ్చి మార్కును ప్రశ్నించారు. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? అంటూ కానిస్టేబుల్‌ గద్దించగా, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారంటూ మార్క్‌ ఎదురు ప్రశ్నించారు.

దీనిపై ఆవేశంతో ఊగిపోయిన కానిస్టేబుల్‌ లాఠీతో మార్కుపై విరుచుకుపడ్డారు. అక్కడ ఉన్న ప్రయాణికులు వారించేందుకు ప్రయత్నించినా కానిస్టేబుల్‌ వినిపించుకోలేదు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు బస్టాండ్‌కు చేరుకొని కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పంపించేశారు. మార్కును పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రం తా స్టేషన్‌లో ఉంచి ఉదయం కొంతమంది పెద్దమనుషులను పిలిపించి బాధితుడిని బుజ్జగించి పంపించారు. కాగా, బస్టాండ్‌లో ప్రయాణికుడిపై కానిస్టేబుల్‌ దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో మార్కు మద్యం సేవించి పోలీసులకు ఎదురు తిరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. బస్టాండ్‌లో ప్రయాణికుడిని కానిస్టేబుల్‌ కొట్టిన విషయంపై విచారణ చేస్తున్నామని ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కానిస్టేబుల్‌ పట్ల ప్రయా ణికుడు దురుసుగా ప్రవర్తించాడని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 03:51 AM