AP NEWS: రమణ దీక్షితులకు పోలీసుల నోటిసులు.. ఏపీ హైకోర్టులో విచారణ
ABN, Publish Date - Mar 07 , 2024 | 09:58 PM
టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు (Ramana Deekshitulu) టీటీడీపై అభియోగాలు మోపారనే కారణంతో ఏపీ పోలీసులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే నోటిసులపై ఏపీ హైకోర్టు (AP High Court) ను ఆయన ఆశ్రయించారు. తనకు పోలీసులు సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసులను హైకోర్టులో రమణ దీక్షితులు సవాల్ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్ట్ ఆదేశించింది.
అమరావతి: టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు (Ramana Deekshitulu) టీటీడీపై అభియోగాలు మోపారనే కారణంతో ఏపీ పోలీసులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే నోటిసులపై ఏపీ హైకోర్టు (AP High Court) ను ఆయన ఆశ్రయించారు. తనకు పోలీసులు సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసులను హైకోర్టులో రమణ దీక్షితులు సవాల్ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్ట్ ఆదేశించింది.
టీటీడీ ఆలయం, అధికారుల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా రమణ దీక్షితులు సోషల్ మీడియాలో మాట్లాడారని టీటీడీ ఐటీ విభాగం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులు పంపించింది. రమణ దీక్షితులకు 76 ఏళ్లు ఉన్నాయని, 65 ఏళ్లు దాటిన వారిని ఇంటి వద్ద విచారించాలని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు చెల్లవని న్యాయవాది చెప్పారు. కేసు విచారణను హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 07 , 2024 | 09:58 PM