Prajagalam: రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ
ABN, Publish Date - Mar 16 , 2024 | 08:47 AM
రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. దీనికోసం 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అసాధారణ భద్రతా ... ఆరు హెలీపాడ్స్ ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల ఎత్తులో సభా వేదికను నిర్మించారు.
అమరావతి: రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ (Prajagalam Meeting) జరగనుంది. దీనికోసం 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే అసాధారణ భద్రతతో పాటు... ఆరు హెలీపాడ్స్ ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల ఎత్తులో సభా వేదికను నిర్మించారు. సభా వేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్‌తో బార్కేడింగ్ జరిగింది. బైకులు, కార్లు కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. జనసేన (Janasena), టీడీపీ (TDP), బీజేపీ (BJP) ముఖ్య నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
60 అడుగుల వెడల్పు.. 40 అడుగుల లోతుతో సభా వేదిక నిర్మాణం జరిగింది. వేదిక పైకి పరిమిత స్థాయిలోనే అనుమతించనున్నారు. వేదిక పై 14 అడుగుల భారీ ఎల్ఈడీ (LED) డిస్‌ప్లే ఏర్పాటు చేసింది. ప్రజలు వీక్షించేందుకు సభా ప్రాంగణంలో 14 ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. వేదికను ఎన్ఎస్‌జీ (NSG) కమాండోల చేతిలోకి అధికారులు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. విజయవాడ, చెన్నై జాతీయ రహదారి నుంచి సభా ప్రాంగణంలోకి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి మోదీ కార్యక్రమం కావడంతో రేపు చెన్నై (Chennai)... విజయవాడ (Vijayawada) రహదారిపై మేదరమెట్ల.. గుంటూరు మధ్య వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
Updated Date - Mar 16 , 2024 | 09:15 AM