సమస్యలవలయంలో పామూరు పశు వైద్యశాల
ABN , Publish Date - Feb 25 , 2024 | 11:43 PM
మండలంలోని ఏకైక పశు వైద్యశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. 25 గ్రామ పంచాయతీల్లో 72 ఆవాస గ్రా మాలున్నాయి. ఇక్కడ వ్యవసాయం తర్వాత పాడిపైనే రైతులు, ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు.

నిర్మించిన పుష్కర కాలానికే విరిగిన తలుపులు, కుంగిన ఫ్లోరింగ్
పామూరు, ఫిబ్రవరి 25 : మండలంలోని ఏకైక పశు వైద్యశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. 25 గ్రామ పంచాయతీల్లో 72 ఆవాస గ్రా మాలున్నాయి. ఇక్కడ వ్యవసాయం తర్వాత పాడిపైనే రైతులు, ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. దాతల సహకారంతో స్థలం కొనుగోలు చేసి నాబార్డ్, ఆర్‌ఐడీఎఫ్, రూ.10 లక్షల 61 వేల అంచనాలతో నిర్మించి, 2012 నవంబర్ 8న పశు వైద్యశాల ప్రారంభించారు. గ డిచిన కొన్ని సంవత్సరా కాలం నుంచి వైద్యశాలలో నిర్మించిన ప్లోరింగ్ అం తా కృంగిపోవడం ప్రారంభమైంది, దాంతో వైద్యశాల సిబ్బంది విధులు నిర్వహించాలన్న అసౌకర్యంగా తయారైంది. వైద్యశాలలో డాక్టర్‌తో పాటు, డిప్యూటేషన్‌పై లైక్‌స్టాక్ అసిస్టెంట్, కాంపౌండర్, అటేండర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్లోరింగ్ కోసం కింద పరిచిన గ్రానైట్ రాళ్లు కిందికు కుంగడంతో ఇసుక అంతా బయటకు వ స్తుంది. కాగా వైద్యశాల మందులు, నిల్వ ఉంచే గదుల ద్వారాలు, తలుపులకు నాశిరకమైన కలపను ఉపయోగించడంతో, చెదులు పట్టి తలుపులు దెబ్బతిని ఊడిపోయి, పగిలిపోయాయి. వైద్యశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. వైద్యశాల మరమ్మతులకు, ప్రహరీ గోడ నిర్మాణానికి పలు మార్లు మండల పరిషత్ నుంచి నిధులు కేటాయించాలని అధికారులు కోరినా ప్రజా ప్రతినిధులు స్పందించలేదు. ఇప్పటికైనా పశుసంవర్థక శాఖ జిల్లా ఉన్నాతాధికారులు స్పందించి నిధులు కేటాచించాలని పశుపోషకులు కోరుతున్నారు.