Share News

Police Dept: అదనపు ఫీచర్లతో ‘ఉమెన్‌ సేఫ్టీ’ యాప్‌

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:43 AM

మహిళా దినోత్సవం సందర్భంగా 8న ‘ఉమెన్‌ సేఫ్టీ’ యాప్‌ను అదనపు ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.

Police Dept: అదనపు ఫీచర్లతో ‘ఉమెన్‌ సేఫ్టీ’ యాప్‌

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8న ‘ఉమెన్‌ సేఫ్టీ’ యాప్‌ను అదనపు ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. ప్రత్యేక మహిళా రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. హెల్ప్‌లైన్‌ నంబర్లు 112, 181, 1098పై విస్తృత అవగాహన పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సాధికారిక వారోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదివారం పేర్కొంది. మెడికల్‌ క్యాంపులు, స్వీయ రక్షణ, వ్యాసరచన పోటీలు, పోలీసు వ్యవస్థపై అవగాహన, చర్చా వేదికలు, మహిళల భద్రతపై వీడియో ప్రదర్శన, పెయింటింగ్స్‌, రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వివరించింది.

Updated Date - Mar 03 , 2025 | 10:56 AM