ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర ప్రసాదానికి ఈ.ఓ. రామారావు శ్రీకారం

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:24 AM

ప్రతీ చైత్రమాసంలో... ప్రతీ వసంత ఋతువులో... రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఏదో ఒక అద్భుతాన్ని భక్త పాఠకులకు సమర్పిస్తుంటారు. ఈసారి కృష్ణమ్మ తరంగాలలో వేప పూల గాలులు ఊరేగుతుండగా మామిడాకుల ఆకుపచ్చని పరిమళాలు కనకదుర్గమ్మ పాదాలను సేవిస్తుండగా... ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ మంత్ర గ్రంధాన్ని జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ఇంద్రకీలాద్రికి సమర్పించింది.

పురాణపండ వ్యాఖ్యాన సొగసులతో దుర్గమ్మకు బొల్లినేని సేవ

‘సౌభాగ్య’ మంత్ర సౌందర్యం ఉగాది ప్రభాతవేళ బెజవాడ కనకదుర్గమ్మ సమక్షంలో ఆవిష్కరణ

విజయవాడ, ఏప్రిల్ 07: ప్రతీ చైత్రమాసంలో... ప్రతీ వసంత ఋతువులో... రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఏదో ఒక అద్భుతాన్ని భక్త పాఠకులకు సమర్పిస్తుంటారు. ఈసారి కృష్ణమ్మ తరంగాలలో వేప పూల గాలులు ఊరేగుతుండగా మామిడాకుల ఆకుపచ్చని పరిమళాలు కనకదుర్గమ్మ పాదాలను సేవిస్తుండగా... ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ మంత్ర గ్రంధాన్ని జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ఇంద్రకీలాద్రికి సమర్పించింది. ప్రతీక్షణం అమ్మవారి ప్రార్ధనతో తరించిపోతున్న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సేవకోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయ శాఖ నియమించిన ఆలయాల సేవల విలువలు తెలుసున్న కార్యనిర్వహణాధికారి, పరమ సంస్కార సంపన్నులుగా చాగంటి కోటేశ్వర రావు వంటి మహోద్దండ ప్రవచన చక్రవర్తిచేత కిర్తించబడ్డ కె.ఎస్ రామారావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉండగానే ‘సౌభాగ్య’ అనే చక్కని ఉపాసనా విలువల గ్రంధాన్ని అమ్మవారి భక్తులకు ఉచితంగా అందించాలనే సంకల్పం మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు కలగడం ... అది వెంటనే పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాన్త రచనా కృషితో నిర్మాణాత్మకంగా కార్యరూపం దాల్చడం... ఇంద్రకీలాద్రిపై అమ్మసేవలో ఆత్మసమర్పణాభావనలో పరవశిస్తున్న కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావుకు లక్షపుస్తకాలు చేరడం టక టకా జరిగిపోయాయి. మానవత్వ దైవత్వాలతో సంచరించే కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య గొప్ప మానవ విలువలున్న వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలో తెలుగువారందరికీ చిరపరిచితులన్న విషయం సాహిత్య సాంస్కృతిక రాజకీయ రంగాల ప్రముఖులకెరుకే.

శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ పాకెట్ సైజ్ గ్రంధానికి రచనా సంకలనకర్తగా వ్యవహరించడంతో ఈ మంగళ గ్రంధంలో సుమారు ఇరవై ఐదు శక్తిమంతమైన ఉపాసనా విశేషాలు శోభిస్తున్నాయి. పూల కొమ్మల్లా పుస్తకమంతా మంత్ర పరిమళాలను పురాణపండ భక్తితో వెదజల్లడంతో ఈ గ్రంధం విశేషంగా ఆకట్టుకునేలా ఉందని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చక బృందాలు స్పష్టం చేశాయి. పూర్తి మల్టీ కలర్ చిత్రాలతో, ఇండియన్ ఆర్ట్ పేపర్‌తో ఉత్తమ విలువల గ్రంధంగా అమ్మ వారి అనుగ్రహంగా శ్రీనివాస్ రూపుదిద్దిన ఈ ‘సౌభాగ్య’ మంత్ర గ్రంధాన్ని దుర్గమ్మ దర్శనార్ధం విచ్చేసే భక్తులకు కొంగు బంగారమని కార్యనిర్వహణాధికారి రామారావు పేర్కొన్నారు.

అన్నదానం పథకానికి విరాళమిచ్చే దాతలకు, దుర్గమ్మ కుంకుమార్చనలలో పాల్గొనే భక్తులకు, దేవస్థానం అధికారిక మాసపత్రిక ‘కనకదుర్గ ప్రభ’ నూతన చందాదారులకు, లడ్డు కొనుగోలుదారులకు, ప్రత్యేక దర్శనాల టికెట్ కొనుగోలు దారులకు ఈ ‘సౌభాగ్య’ ప్రత్యేక గ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు కె.ఎస్ రామారావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ఈ ‘మంత్ర ప్రసాదం’ను సమర్పిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి రామారావు పేర్కొంటూ.. ఈ అద్భుతకార్యాన్ని సమర్పించిన బొల్లినేని కృష్ణయ్యకి , అద్భుత సొగసులతో ఈ సౌందర్యమయ గ్రంధాన్ని రూపుదిద్దిన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి దుర్గమ్మ అనుగ్రహవర్షం తప్పకుండా కురుస్తుందని చెప్పారు. 132 పేజీల ఈ మంత్ర సౌందర్యాన్ని ఉగాది ప్రభాతవేళ బెజవాడ కనకదుర్గమ్మ సమక్షంలో కార్యనిర్వహణాధికారి రామారావు పవిత్రహస్తాలతో సౌభాగ్య ఆవిష్కరించబడుతోందని, తెలుగు నూతన సంవత్సరాది నుండే ఈ పుస్తకం భక్తులకు ఉచితంగా దేవస్థానం అందజేస్తుందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి.

Updated Date - Apr 08 , 2024 | 12:24 AM

Advertising
Advertising