Home » Soubhagya Book
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమ శోభాయమానంగా రూపొందించిన సౌభాగ్య దివ్య గ్రంధాన్ని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల పవిత్ర వేదికపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం జాయింట్ కమీషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు.
ప్రతీ చైత్రమాసంలో... ప్రతీ వసంత ఋతువులో... రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఏదో ఒక అద్భుతాన్ని భక్త పాఠకులకు సమర్పిస్తుంటారు. ఈసారి కృష్ణమ్మ తరంగాలలో వేప పూల గాలులు ఊరేగుతుండగా మామిడాకుల ఆకుపచ్చని పరిమళాలు కనకదుర్గమ్మ పాదాలను సేవిస్తుండగా... ఒక అపురూపమైన ‘సౌభాగ్య’ మంత్ర గ్రంధాన్ని జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ఇంద్రకీలాద్రికి సమర్పించింది.