ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉన్నత విద్యాశాఖ ప్రక్షాళన ప్రారంభం

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:09 AM

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభించింది.

  • వేమన యూనివర్సిటీకి మండలి కార్యదర్శి బదిలీ

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభించింది. గత ప్రభుత్వం నియమించిన వారితోనే ఉన్నత విద్యామండలిని నడిపిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు కార్యదర్శిని మార్చింది. మండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ను ఆయన సొంత యూనివర్సిటీ యోగి వేమనకు పంపాలని ఆదేశిస్తూ ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ స్థానంలో మండలి జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తిని ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల విద్య, ఇంటర్‌ విద్యలో మార్పులు చేసిన ప్రభుత్వం ఉన్నత విద్యను మాత్రం కదిలించలేదు. అడ్మిషన్లపై ప్రభావం పడుతుందనే ఆలోచనతో ఇప్పటివరకూ పాత వారినే కొనసాగించింది. ఇప్పుటికైనా ప్రక్షాళన మొదలుపెట్టడంతో ఉన్నత విద్యాశాఖ మెరుగుపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 11 , 2024 | 04:09 AM