ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: వైసీపీకి బిగ్ షాక్..

ABN, Publish Date - Sep 24 , 2024 | 07:11 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా వరుసపెట్టి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీ నుంచి జంప్ అవగా.. ఇప్పుడు ఏరికోరి తెచ్చుకున్న నేత కూడా హ్యాండిచ్చారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం పొందిన..

YSRCP

అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా వరుసపెట్టి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీ నుంచి జంప్ అవగా.. ఇప్పుడు ఏరికోరి తెచ్చుకున్న నేత కూడా హ్యాండిచ్చారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం పొందిన ఆర్ కృష్ణయ్య.. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. ఈ రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 8 కి పడిపోయింది. ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా వీరి సరసన చేరిపోయారు.


రాజ్యసభలో బలముందని రెచ్చిపోయారు..

లో‌క్‌సభలో తమకు బలం లేకపోయినప్పటికీ.. రాజ్యసభలో తమకు బలం ఉందని.. తమ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, రోజులు గడుస్తున్నాకొద్ది.. పరిస్థితులు తారుమారవుతున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య క్రమంగా పడిపోతుంది. సభలో వైసీపీకి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా.. ప్రస్తుతం వీరిలో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 8కి పడిపోయింది. ప్రస్తుతం పెద్దల సభలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, వి. విజ‌య‌సాయిరెడ్డి, నిరంజన్‌ రెడ్డి, మేడా ర‌ఘునాథ‌రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ పిల్లి, న‌త్వాని ప‌రిమ‌ళ్‌ ఉన్నారు.


Also Read:

అక్రమ నిర్మాణాలపై మంత్రి తుమ్మల వార్నింగ్

ఇండియాకు ప్రధాని మోదీ.. చంద్రబాబు కీలక ట్వీట్

రైతులకు అలర్ట్.. ఆ నిధులు కావాలంటే ఈ పని చేయాల్సిందే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 24 , 2024 | 07:11 PM