ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Weather Update: ఉత్తరాంధ్ర తప్ప మిగిలిన చోట్ల వర్షాలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 07:48 AM

నైరుతి రుతు పవనాలు కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రతోపాటు తెలంగాణ, ఉత్తరాంధ్ర సహా మరికొన్ని ప్రాంతాలు ముందుకు సాగుతున్నాయి. రాయలసీమలో ఆవర్తనం విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

weather update

హైదరాబాద్: నైరుతి రుతు పవనాలు కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రతోపాటు తెలంగాణ, ఉత్తరాంధ్ర సహా మరికొన్ని ప్రాంతాలు ముందుకు సాగుతున్నాయి. రాయలసీమలో ఆవర్తనం విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తప్ప మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.


అప్రమత్తం

ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉరుములు పడే సమయంలో చెట్లు, పోల్స్, టవర్ కింద, బహిరంగ ప్రదేశాల్లో జనం ఉండొద్దని కోరారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతోపాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.


భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే.. ఈ నెల 10వ తేదీ వరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళలో 9వ తేదీ వరకు, ఆంధ్రప్రదేశ్‌లో 9, 10వ తేదీల్లో, తెలంగాణలో 10వ తేదీ, అరుణాచల్ ప్రదేశ్ 8 నుంచి 10వ తేదీ వరకు, నాగాలాండ్ 10వ తేదీన శుక్రవారం (ఈ రోజు) తమిళనాడు, పుదుచ్చేరిలో వర్ష ప్రభావం ఉంటుందని వెల్లడించారు.


రాజస్థాన్‌లో మాత్రం

రాజస్థాన్‌లో ఈ రోజు భారీగా ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రకటించారు. మరోవైపు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, బీహర్, ఒడిశాలో ఇంకా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు.

Updated Date - Jun 07 , 2024 | 08:47 AM

Advertising
Advertising