కులధృవీకరణ పత్రాలపై ఆర్డీవో విచారణ
ABN, Publish Date - Aug 28 , 2024 | 11:45 PM
ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు.
పీలేరు, ఆగస్టు 28: ఎస్సీ కులధృవీకరణ పత్రాల జారీ అంశంపై రాయచోటి ఆర్డీవో రంగస్వామి బుధవారం పీలేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ నిర్వహించారు. గతంలో వలంటీర్ల వ్యవస్థ ఉన్నప్పుడు పీలేరు పట్టణం లక్ష్మీ పురం, సరోజినీదేవి వీధి, గాజుల వెంక టప్ప సందు, జేకే నగర్ ప్రాంతాల్లోని పలు చిరునామాలతో చాలా మంది ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వోల క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయా దరఖాస్తుల్లో పలు తప్పులు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారు ఆ విషయాన్ని పీలే రు తహసీల్దారు భీమేశ్వరరావు ద్వారా ఆర్డీవో రంగస్వామికి తెలియజేశారు. దీంతో ఆయన ఆయా దరఖాస్తుల్లోని చిరునామాల ఆధారంగా బుధవారం విచారణ జరిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు పట్టణంలో పెద్దఎత్తున ఎస్సీ కులధృవీకరణ కోసం దరఖాస్తులు వచ్చి ఉండడంతో నిజనిర్ధారణ కోసం తాము విచారణ జరిపామని ఈ విచారణలో చాలా దరఖాస్తుల్లో కనబరిచిన చిరునామాలు, ఎస్సీ ధృవీకరణ కోసం జతప రిచిన పత్రాలు సరిగ్గా లేకపోవడం గమనించామన్నారు. కొన్నిచోట్ల వలంటీర్లు అత్యు త్సాహం, మరికొన్ని చోట్ల దరఖాస్తుదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల తప్పులు దొర్లినట్లు తెలిసిందని తెలిపారు. తమ విచారణ సారాంశాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధి కారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు భీమేశ్వర రావు, వీఆర్వోలు శిల్ప, కవిత, మాలమహానాడు నాయకులు మల్లిఖార్జున, సుభాష్ పాల్గొన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 11:45 PM