Shock to Big Movies: పెద్ద సినిమాలకు షాక్.. తెలంగాణ సర్కార్ నిర్ణయానికి జై కొట్టిన థియేటర్స్ యాజమాన్యం
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:24 PM
తెలంగాణలో బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు..
తెలంగాణలో గత రెండు రోజులుగా బెనిఫిట్ షోల అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సీఎంగా ఉన్నంతవరకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తరువాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రానున్న రోజుల్లో తెలంగాణలో బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు అనుమతి వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామన్నారు. బెనిఫిట్‌షోల పేరుతో వందల రూపాయిల టికెట్ ధరను వేల రూపాయిలకు పెంచడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి పెద్ద సినిమాలకు అవకాశం కల్పిస్తోంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు సమావేశమై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం, విడుదలకు ముందురోజు షో వేయడాన్ని అనుమతించరు.
ఎగ్జిబిటర్స్ సంఘం నాయకులు ఏమన్నారంటే
అర్థరాత్రి సమయాల్లో షోలు వేయడం సరైన నిర్ణయం కాదని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు తెలిపారు. కొంతమంది షోలకు తాగి వస్తున్నారని, దీంతో థియేటర్ యాజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఉదయం నుంచే షోలు వేయాలనేది తమ కోరికని పేర్కొన్నారు. హీరోలు థియేటర్స్‌కు రావద్దని తాము అనబోమని, ప్లాన్ చేసుకుని రావాలని సూచించారు. సంధ్య థియేటర్‌కు టికెట్ కొన్నవారు మాత్రమే వచ్చిఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదన్నారు. హీరో రావడంతోనే ఎక్కువ సంఖ్యలో అభిమానులు వచ్చారని, థియేటర్ యాజమాన్యం వారిని నియంత్రించే పరిస్థితి లేదన్నారు. టికెట్స్ రేట్ల పెంపుతో నిర్మాతలకు తప్పితే ఎగ్జిబిటర్స్‌కు రూపాయి ఉపయోగం లేదన్నారు.
పెద్ద సినిమాలకు షాక్..
సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొందరు ప్రొడ్యూసర్లకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఘటన కారణంగా అన్ని సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని కొందరు అంటుండగా.. తాజాగా ఎగ్జిబిటర్స్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండటంతో పెద్ద సినిమాలకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. బెనిఫిట్ షోల ద్వారా ప్రొడ్యూసర్లకు, ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఓవైపు ప్రొడ్యూసర్ల ఆదాయానికి గండిపడనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 23 , 2024 | 03:24 PM