AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్ కాని స్కూళ్లు ఎన్నంటే..!?
ABN, Publish Date - Apr 22 , 2024 | 01:04 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. .
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు (AP SSC Results) వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఇదేం ట్విస్ట్!
ఇవన్నీ అటుంచితే.. రాష్ట్రంలో 100 శాతం ఉత్తీర్ణత 2,803 పాఠశాలల్లో నమోదయ్యింది. ఇక 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. అంటే జీరో శాతం ఫలితం అన్న మాట. అయితే ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ బడులు ఉండగా.. మిగిలిన ఒక్కటి గవర్నమెంట్ స్కూల్. అయితే ఆ స్కూళ్ల వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. ఆకుల వెంకటసాయి మనస్వి అనే విద్యార్థినికి 600కు 599 మార్కులు రావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఒక్క సెకండ్ లాంగ్వేజీలో తప్ప.. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇక 96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌లో ఉండగా.. 62.47% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది.
Updated Date - Apr 22 , 2024 | 01:06 PM